News


రూ.41,000 పైకి పసిడి

Wednesday 8th January 2020
Markets_main1578459626.png-30757

  • 4 ట్రేడింగ్‌ సెషన్లలో రూ.2000 ర్యాలీ 

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో బుధవారం పసిడి ఫ్యూచర్ల ధర రూ.41వేల అందుకుంది. మధ్యప్రా‍చ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఏడేళ్ల గరిష్టానికి చేరుకోవడం, దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 20పైసలు బలహీనపడటం తదితర కారణాలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో  10గ్రాముల పసిడి ధర నిన్నటి ముగింపు(రూ.40,663)తో పోలిస్తే రూ.615లు పెరిగి రూ.41,278లను అందుకుంది. ఈ ధర పసిడికి రికార్డు  గరిష్టస్థాయి కావడం విశేషం. ప్రస్తుతం రూ.562 లాభంతో రూ.41,225 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి  మార్కెట్‌ ముగిసే సరికి రూ.191ల లాభంతో రూ.40,663 వద్ద స్థిరపడింది. నాలుగు ట్రేడింగ్‌ సెషన్‌లో పసిడి ధర ఏకంగా రూ.2000లు ర్యాలీ చేసింది. ఎంసీఎక్స్‌ ఫిబ్రవరి పసిడి ఫ్యూచర్లు ధర రూ.41000 స్థాయిని పరిక్షీణించిన తరువాత రూ.40200 వద్ద తీవ్రంగా దిద్దుబాటు గురైంది. రూ.41,400ల స్థాయి లక్ష్యంతో రూ.40750 స్టాప్‌లాస్‌తో పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయమని బులియన్‌ విశ్లేషకులు సలహానిస్తున్నారు.

అంతర్జాతీయంగా ఏడేళ్ల గరిష్టానికి:- 
ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ మిసైల్‌ దాడులకు పాల్పడింది. అమెరికా సైన్యాలు పశ్చిమాసియాను విడిచివెళ్లాలని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్‌ క్షిపణి దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఖండించారు. సరైన సమయంలో ఘాటుగా బదులిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. ఇరాన్‌ దాడులతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రక్షణాత్మక సాధనమైన పసిడిలోకి మళ్లిస్తున్నారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర ఏడేళ్ల గరిష్ట స్థాయి 1,613 డాలర్లకు చేరుకుంది.  

రూపాయి 20పైసలు క్రాష్‌:- 
అంతర్జాతీయంగా ముడిచమురు మంటల సెగలు, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలతో రూపాయి భారీగా బలహీనపడింది. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 20పైసలు కరిగిపోయి తిరిగి 72స్థాయికి దిగివచ్చింది. ప్రస్తుతం 18 పైసలు(0.25 శాతం) బలహీనపడి 72 వద్ద ట్రేడవుతోంది. బలహీనమైన రూపాయి పసిడి ర్యాలీకి తోడ్పాలునిస్తాయి. 



You may be interested

నిఫ్టీలో షార్ట్‌ స్ట్రాంగిల్‌ వ్యూహం బెటర్‌!

Wednesday 8th January 2020

నిపుణుల సూచన రిస్కు తీసుకునేందుకు సంశయించని ట్రేడర్లు ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టీ ఆప్షన్స్‌లో షార్ట్‌ స్ట్రాంగిల్‌ వ్యూహం అవలంబించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం వచ్చే వారం ఎక్స్‌పైరీ అయ్యే ఆప్షన్‌ సీరిస్‌ను ఎంచుకోవాలని తెలిపారు. ఇరాన్‌, యూఎస్‌ ఉద్రిక్తతలతో సూచీల్లో ఆటుపోట్లు పెరిగిన సంగతి తెలిసిందే. వీఐఎక్స్‌ కీలక 15 స్థాయికి పైన ప్రస్తుతం కదలాడుతోంది. ఇలాంటప్పుడు పరిమిత లాభాల కోసం కొంత రిస్కు తీసుకొని పైన చెప్పిన వ్యూహం పాటించవచ్చని

ఒడిదుడుకుల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 8th January 2020

బ్యాంకు నిఫ్టీలో స్వల్ప రికవరీ బుధవారం బ్యాంకు నిఫ్టీ ఆరంభంలో దాదాపు 500 పాయింట్లు నష్టపోయి 30899 పాయింట్ల కనిష్టాన్ని నమోదు చేసింది. అయితే అనంతర ట్రేడింగ్‌లో క్రమంగా కోలుకొని 31220 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో దాదాపు 300 పాయింట్ల నష్టం నుంచి రికవరీ చెందినట్లయింది. కానీ ఈ రికవరీ తాత్కాలికమేనని బ్యాంకు నిఫ్టీ కీలక రైజింగ్‌ వెడ్జ్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌డౌన్‌ చూపిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో

Most from this category