News


రూ.44,000పైకి పుత్తడి

Monday 24th February 2020
Markets_main1582517892.png-32032

సాక్షి, హైదరాబాద్‌: కొద్ది రోజులుగా రాకెట్‌లా దూసుకెళ్తున్న పుత్తడి ధర ఆదివారం సరికొత్త రికార్డు సృష్టించింది. మేలిమి బంగారం (24 క్యారట్లు) ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ. 44 వేలు దాటింది. ఆదివారం జరిపిన విక్రయాల్లో 24 క్యారట్ల బంగారం ధర గ్రాముకు రూ. 4,443 చొప్పున ధర పలికింది. అంటే 10 గ్రాములకు రూ. 44,430 ధర పలికిందన్నమాట. అదే ఆభరణాలకు ఉపయోగించే 22 క్యారట్ల బంగారం గ్రాముకు రూ. 4,073 ధర పలికినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. గత వారం రోజుల్లో హైదరాబాద్‌ మార్కెట్‌లో మేలిమి బంగారం ధర పది గ్రాములకు రూ.1,790 పెరిగింది. ఈ నెల 17న రూ. 42,640 ధర పలకగా 23న రూ. 44,430కి చేరింది. ఇక 22 క్యారట్ల బంగారం కూడా రూ. 1,580 మేర పెరిగింది. కాగా ఆదివారం విజయవాడ బులియన్‌ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.40,720 ఉండగా 24 క్యారెట్లు (బిస్కెట్‌ బంగారం) రూ.44,020 ఉంది. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి వల్ల వాణిజ్య రంగంలో నెలకొన్న ఒడిదుడుకులను తట్టుకొనేందుకు పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు వైపు మొగ్గుచూపడంతోపాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతుండటం బంగారం ధరలు అమాంతం పెరగడానికి కారణమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 

 



You may be interested

భగ్గుమన్న బంగారం

Monday 24th February 2020

కరోనా వైరస్‌ భయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భగ్గుమనడంతో సోమవారం దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో శనివారం ముగింపుతో పోలిస్తే రూ.383పెరిగి 10 గ్రాముల పసిడి రూ.43049 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా దేశీయ ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ.43000కు చేరడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో 15 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,663.60 డాలర్ల వద్ద

ప్రపంచ మార్కెట్లలో కరోనా కల్లోలం

Monday 24th February 2020

పలు దేశాలకు విస్తరిస్తున్న కరోనా వైరస్‌ దక్షిణ కొరియా, ఇరాన్‌, ఇటలీలో వణుకు యూరోపియన్‌, అమెరికన్‌ ఫ్యూచర్స్‌ డీలా ముడిచమురు ధరలు పతనం- పసిడి అప్‌ చైనాలో పుట్టిన కోవిడ్‌-19 ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే చైనాలో మృతుల సంఖ్య 2,400ను అధిగమించగా.. తాజాగా దక్షిణ కొరియా, ఇరాన్‌, ఇటలీ దేశాలలోనూ వైరస్‌ బాధితుల సంఖ్య నమోదవుతోంది. దీంతో కొరియాలో హై అలర్ట్‌ ప్రకటించగా.. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో మళ్లీ ఆందోళనలు తలెత్తాయి. వెరసి ఇటు యూరోపియన్‌,

Most from this category