News


రూ.44,000 వద్ద స్థిరంగా పసిడి

Saturday 7th March 2020
Markets_main1583554900.png-32344

అంతర్జాతీయ మార్కెట్‌లో అన్చితి పరిస్థితులు నెలకొనడం, దేశీయంగా రూపాయి బారీగా బలహీనపడడం, కరోనా వైరస్‌ వ్యాప్తి వంటి అంశాలు కారణంగా బంగారం ధర గత ఐదురోజులుగా పెరగుతూ వస్తూ శుక్రవారం జీవిత కాలగరిష్టానికి చేరింది. ఒకే రోజు రూ.1000 పెరిగిన బంగారం శనివారం స్వల్పంగా తగ్గింది. మల్టీకమోడిటీ మార్కెట్‌లో రూ.465 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.44,158.00 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ 1,692 డాలర్లకు పెరిగిన పసిడి మార్కెట్‌ ముగిసే సమయానికి 16 డాలర్లు తగ్గి 1,674.35 డాలర్ల వద్ద ముగిసింది.

(శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)



You may be interested

10 శాతం పడిపోయిన చమురు ధరలు

Saturday 7th March 2020

ఉత్పత్తిలో కోతలకు రష్యా విముఖం నాలుగేళ్ల కనిష్టానికి  కనిష్టానికి చమురు ధరలు రోజురోజుకీ నీరసిస్తున్న చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో ఉత్పత్తిలో కోతలను అమలు చేసే ప్రణాళికలకు రష్యా నో చెప్పడంతో వారాంతాన ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఏకంగా 10 శాతం పతనమయ్యాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 9.4 శాతం(4.72 డాలర్లు) పడిపోయి 45.27 డాలర్ల వద్ద ముగిసింది. ఇది 2017 జులై తదుపరి  కనిష్టంకాగా.. ఈ బాటలో

మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్‌ టిగువన్‌ ఆల్‌స్పేస్‌

Saturday 7th March 2020

ధరల శ్రేణి రూ. 28.15 లక్షలు – 31.54 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోక్స్‌వ్యాగన్‌’.. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)–6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న 7-సీటర్‌ టిగువన్‌ ఆల్‌స్పేస్‌ ప్రీమియం స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ)ని శుక్రవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 2-లీటరు పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ అధునాతన ఎస్‌యూవీ ధరల శ్రేణి రూ. 28.15 లక్షలు – 31.54 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. మునుపటి

Most from this category