News


స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 17th December 2019
Markets_main1576563576.png-30270

గత వారం ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన వాణిజ్య ఒప్పందంపై నిరాశావాదం నెలకొనడంతో ఆసియాలో మంగళవారం పసిడికి డిమాండ్‌ పెరిగింది. నేటి ఉదయం ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు లాభపడి 1,482 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వైట్‌హౌస్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ లారీ కుడ్లీ చైనాతో వాణిజ్య ఒప్పందం ఖచ్చితంగా కుదిరిందని వివరణ ఇచ్చినప్పటికీ కొందరు ట్రేడర్లు బీజింగ్‌తో ఒప్పందం ఖరారుపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచుకునే వ్యవహారంపై చైనా తీరు ఎలా ఉంటుంతో అనే అంశంపై స్పష్టత లేదని విశ్లేషకులంటున్నారు. సుమారు 50 బిలియన్ డాలర్ల వార్షిక వ్యవసాయ కొనుగోళ్లను చైనా చేయాల్సి ఉంటుందని మీడియా వర్గాలు తెలిపాయి. ఇక నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు వరుసగా మూడో రోజూ రికార్డు ర్యాలీ చేసిన నేపథ్యంలో పసిడి ధర 1480డాలర్ల వద్ద స్థిరపడింది.

దేశీయ మార్కెట్లో స్వల్ప లాభాల్లో:-
దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్ప లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. రేపు జరిగే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో బంగారం నగలపై జీఎస్‌టీ పెంచవచ్చనే  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంసీక్స్‌ మార్కెట్లో నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.24లు లాభంతో రూ.37895.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి మార్కెట్‌ ముగిసే సరికి 10గ్రాముల ఫిబ్రవరి కాంటాక్టు ధర రూ.98 లాభపడి రూ.37871 వద్ద స్థిరపడింది. 



You may be interested

టాప్‌ బ్రోకరేజ్‌ల నుంచి ఐదు సిఫార్సులు

Tuesday 17th December 2019

లాంగ్‌టర్మ్‌కు దాదాపు 31 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.  1. వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌: షేర్‌ఖాన్‌ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 285. బహుళముఖ వ్యూహంతో అనుకున్న రెవెన్యూ గ్రోత్‌ గైడెన్స్‌ను సాధించగలదు. ప్రస్తుతం సరసమైన పీఈ వద్ద ట్రేడవుతోంది. రాబోయే సంవత్సరాల్లో 20 శాతం నికర ఎర్నింగ్స్‌లో చక్రీయ వార్షిక వృద్ది ఉంటుందని అంచనా. టైర్‌2, 3 నగరాల్లోకి వేగంగా విస్తరించడం, లోమార్జిన్‌ ఉత్పత్తులను

44,500 పాయింట్లకు సెన్సెక్స్‌!

Tuesday 17th December 2019

వచ్చే ఏడాదికి బీఎన్‌పీ టార్గెట్‌ కొత్త సంవత్సరంలో సెన్సెక్స్‌ 44,500 పాయింట్లను చేరే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం బీఎన్‌పీ పారిబా అంచనా వేసింది. ఇండియా సహా చైనా, థాయ్‌లాండ్‌, సౌత్‌కొరియా మార్కెట్లపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు తెలిపింది. ఇండోనేసియా మార్కెట్‌ను ఓవర్‌వెయిట్‌ నుంచి న్యూట్రల్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు తెలిపింది. క్రూడాయిల్‌ ధర స్థిరంగా కొనసాగుతున్నందున ముడిపదార్ధాలు చౌకగా దొరకడం తగ్గవచ్చని, పామాయిల్‌ ధరలు పెరగడం కూడా ప్రభావం చూపుతుందని అంచనా

Most from this category