News


స్థిరంగా పసిడి

Wednesday 20th November 2019
Markets_main1574228628.png-29727

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.32ల స్వల్ప నష్టంతో రూ.38173.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇన్వెస్టర్లు తన పెట్టుబడును ఈక్విటీల్లోకి మళ్లిస్తుండంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ ర్యాలీ రెండోరోజూ కొనసాగుతుంది. అలాగే డాలర్‌ మారకంలో రూపాయి బలహీనంగా ట్రేడ్‌ అవుతోంది. ఫలితంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గుతోంది. ఇక నిన్నటి ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 13పైసలు లాభపడటంతో రూ.24లు నష్టంతో రూ.38205 వద్ద స్థిరపడింది. పసిడికి ధర రూ.37,920 వద్ద పసిడి కీలక మద్దతు ధర ఏర్పడింది. ప్రసుత్తం పసిడి ధర రూ.38,050 వద్ద మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకోని రూ.38,330 స్థాయిని పరీక్షిస్తుంది. పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయడం అనే సూత్రాన్ని అవలంభించవచ్చని బులియన్‌ పండితులు సలహానిస్తున్నారు. 

దేశీయంగా వివిధ నగరాల్లో స్పాట్‌ గోల్డ్‌(24 క్యారెట్లు) నిన్నటి(18-11-2019) ముగింపు ధర కోసం ఆయా నగరాల గుర్తుపై క్లిక్‌ చేయండి


అంతర్జాతీయంగానూ స్థిరంగా:-
అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 0.10డాలరు నష్టంతో 1,474.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాల మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై సరైన స్పష్టత, ఫెడ్‌ రిజర్వ్‌ మినిట్స్‌ వెల్లడి తదితర కీలకాంశాల కోసం పసిడి ట్రేడర్లు ఆస్తకిగా ఎదురుచూస్తున్నారు. ఇక నిన్నటి ఉదయం నష్టాల బాటపట్టినప్పటికీ.., రాత్రి యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ బలహీనత కారణంగా ఇంట్రాడే నష్టాలను పూడ్చుకుని వరకు రెండోసారి లాభపడి 2.40డాలరు లాభంతో 1,474.30డాలర్ల వద్ద ముగిసింది.

 



You may be interested

ఆర్‌ఐఎల్‌లో కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహం!

Wednesday 20th November 2019

రిస్కు తీసుకునే ట్రేడర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరులో కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. షేరులో కనిపిస్తున్న జోరు మరికొంత కాలం కొనసాగుతుందన్న అంచనాలతో ఈ వ్యూహం అవలంబిస్తారు. కంపెనీ పోటీదారులైన ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌ బాటలో టారిఫ్‌లు పెంచాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ షేరు మరింత ముందుకే కొనసాగవచ్చని నిపుణుల అంచనా.  వ్యూహం: కాల్‌ రేషియో స్ప్రెడ్‌లో భాగంగా 1560 కాల్‌ కొనుగోలు చేసి 1620 కాల్స్‌ రెండిటిని

ఆల్‌టైం గరిష్ఠానికి సెన్సెక్స్‌, 12,000 పైన నిఫ్టీ

Wednesday 20th November 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండస్‌ఇం‍డ్‌ బ్యాంక్‌ షేర్లు ర్యాలీ చేయడంతో బుధవారం సెషన్లో సెన్సెక్స్‌ కొత్త గరిష్ఠానికి చేరుకుంది. ఉదయం 10.31 సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2721.63 పాయింట్లు లాభపడి 40743.33 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో 40,469.70 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్‌, బుధవారం సెషన్లో 40,768.83 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అదేవిధంగా గత కొన్ని సెషన్‌లలో  కీలక నిరోధంగా పనిచేస్తున్న 12,000 స్థాయిని నిఫ్టీ బుధవారం

Most from this category