News


స్థిరంగా పసిడి ధర

Friday 27th September 2019
Markets_main1569565901.png-28587

ప్రపంచమార్కెట్లో పసిడి శుక్రవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి 2 డాలర్ల స్వల్ప నష్టంతో 1,513.35డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. పసిడి ఇన్వెస్టర్లు అగ్రరాజ్యమైన అమెరికా ప్రతినిధుల సభలో ఆ దేశాధ్యక్షుడైన ట్రంప్‌పై అభిశంసన తీర్మానం అంశంపై, అమెరికా-చైనాల వాణిజ్య చర్చల పరిణామాలపై దృష్టిని సారించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల నిమిత్తం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ఆరోపణలు రావడంతో దీనిపై ఆయనను అభిశంసించాలని కాంగ్రెస్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక వాణిజ్య చర్చలు అంశం విషయానికొస్తే... అక్టోబర్‌ మొదటివారంలో వాషింగ్టన్‌లో అమెరికా-చైనా ఉన్నత స్థాయి అధికారులు తిరిగి చర్చలు ప్రారంభించనున్నారు. 
దేశీయంగా స్వల్ప నష్టాల్లో పసిడి ధర:- 
నేడు రూపాయి ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతుండటంతో పాటు ఈక్విటీ మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ.60.00 నష్టంతో  రూ.37734.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికే పసిడి ధర రూ.192లు లాభపడి రూ.37794 వద్ద ముగిసింది. 



You may be interested

కళతప్పిన మెటల్‌ షేర్లు

Friday 27th September 2019

అంతర్జాతీయంగా మెటల్‌ షేర్ల పతన ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ మెటల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. అమెరికాతో వాణిజ్య వివాదాలు కార్పొరేట్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపడంతో ఆగస్ట్‌లో చైనా దేశపు ఇండస్ట్రీయల్‌ ప్రాఫిట్స్‌ 2శాతం తగ్గినట్లు నేడు చైనా నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకటించింది. మరోవైపు ఇరుదేశాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు మధ్య ఈ అక్టోబర్‌ ప్రారంభంలో వాణిజ్య చర్చలు ప్రారంభంకానున్నాయి. ఇరు దేశాలు మధ్యంతర

ఎనిమిదేళ్ల కనిష్టానికి యస్‌ బ్యాంక్‌

Friday 27th September 2019

ప్రమోటర్ల వాటా విక్రయాలతో తీవ్ర కష్టాలను ఎదుర్కోంటున్న యస్‌బ్యాంక్‌ షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఎనిమిదేళ్ల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  క్రితం ట్రేడింగ్‌లో 5శాతం నష్టపోయిన యస్‌బ్యాంక్‌ షేర్లు... నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ ప్రధాన ప్రమోటింగ్‌ సంస్థల్లోఒకటైన యస్‌ క్యాపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ(వైసీపీఎల్‌) ప్రతి షేరు ధర రూ.51.94 చొప్పున మొత్తం 4.65 కోట్ల ఈక్విటీ షేర్లను(1.82శాతం వాటాకు సమానం) రూ.241.5 కోట్లకు విక్రయించింది. అలాగే

Most from this category