డాలర్ రికవరీ: నష్టాల్లో పసిడి
By Sakshi

ప్రపంచమార్కెట్లోని పసిడి ధర మంగళవారం 9డాలర్ల మేర నష్టపోయింది. డాలర్ బలపడటంతో పాటు ట్రేడర్ల లాభాల స్వీకరణ ఇందుకు కారణమైంది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ధర 1,425.55డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. పసిడి ధరను ప్రభావితం చేసే డాలర్ వరుసగా మూడోరోజూ రికవరీ కావడంతో పాటు వారం రోజుల గరిష్టాన్ని అందుకోవడంతో పసిడి ఫ్యూచర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల భారీ కోతను అరశాతంగా అంచనా వేస్తున్న మార్కెట్‌కు కోత విధింపు పావుశాతంగా ఉంటుందని నివేదికలు వెల్లడికావడంతో డాలర్ బలపడుతోంది. అలాగే నిన్న అమెరికా, నేడు ఆసియాలోని పలు ప్రధాన ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ఫలితంగా నేడు ఔన్స్ పసిడి ధర 12డాలర్లు క్షీణించి 1,414 డాలర్ల వద్ద కనిష్టానికి పతనమైంది. భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.11:00లకు ఔన్స్ పసిడి ధర 11డాలర్ల నష్టంతో 1,415 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. పసిడి 1422 డాలర్ల కీలక మద్దతు ధరను కోల్పోవడంతో 1,401 - 1,409 శ్రేణి మధ్యలో తదుపరి మద్దతు ధర ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశీయంగా రూ.35000 దిగువకు పసిడి ధర:-
ఇక దేశీయ ఎంసీఎక్స్‌లో మార్కెట్లో పసిడి ధర రూ.35000ల దిగువకు చేరుకుంది. నేడు ఎంసీఎక్స్ మార్కెట్లో 10గ్రాముల పసిడి ఆగస్ట్ ఫ్యూచర్ కాంట్రాక్టు ధర రూ.217.00లు నష్టపోయి రూ.34915.00 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటి రాత్రి ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే సరికి రూ.96ల స్వల్ప లాభంతో రూ.35,132ల వద్ద స్థిరపడింది.
You may be interested
కోటక్ బ్యాంక్ లాభం రూ. 1, 932 కోట్లు
Tuesday 23rd July 2019న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.1,932 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత క్యూ1లో వచ్చిన నికర లాభం(రూ.1,574 కోట్లు)తో పోల్చితే 23 శాతం వృద్ధి సాధించామని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. నికర లాభంలో 30 శాతం వాటా అనుబంధ కంపెనీల వల్లనే వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.9,904 కోట్ల నుంచి రూ.12,130 కోట్లకు చేరిందని పేర్కొంది.
కుమార్తెల కోసం తనఖా..యస్ బ్యాంక్ 4 శాతం పతనం
Tuesday 23rd July 2019రానా కపూర్ తన కుమార్తెల వెంచర్లకు సెక్యురిటీగా తన యస్ బ్యాంక్ షేర్లను తనఖా పెట్టారు. తన కుమార్తెలు రాధా ఖన్నా, రాఖే టాండన్, రోషిని కపూర్ యాజమాన్యంలో ఉన్న మోర్గాన్ క్రెడిట్స్ సంస్థకు అసురక్షిత రుణాలు ఉన్నాయని కపూర్ తెలిపారు. ‘నా కుమార్తెల వ్యవస్థాపక ప్రయత్నాల కోసం యస్ బ్యాంక్‌లో ఉన్న నా సొంత వాటాలను తనఖాగా పెట్టాను’ అని కపూర్ వివరించారు. అంతేకాకుండా మోర్గాన క్రెడిట్స్ సంస్థ