STOCKS

News


లాభాల్లో బంగారం​

Wednesday 9th October 2019
Markets_main1570594887.png-28777

   చైనా సాంకేతిక కంపెనీలను యుఎస్‌ ట్రంప్‌ ప్రభుత్వం బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టడంతోపాటు, కొంత మంది చైనా అధికారులకు యుఎస్‌ వీసా నిరాకరించడంతో యుఎస్‌-చైనా మధ్య ఉద్రిక్త వాతవరణం ముదిరింది. యుఎస్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను చైనా తీవ్రంగా ఖండిస్తోంది. కాగా గురువారం ఇరు దేశాల మధ్య జరగనున్న వాణిజ్య చర్చలకు ముందు ఈ అనిశ్చితి చోటు చేసుకోవడంతో బంగారం ధరలు తిరిగి లాభాల బాట పట్టాయి. దీంతోపాటు యుఎస్‌ ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌పాల్‌ అక్టోబర్‌లో జరగనున్న ఫెడ్‌ సమావేశంలో వడ్డీ రేట్ల కోత ఉంటుందనే సంకేతాలను ఇవ్వడంతో కూడా బంగారం పెరగడానికి కారణమయ్యింది.
    యుఎస్‌ ఫెడ్‌ మినిట్స్‌కు ముందు యూరోప్‌ మార్కెట్‌లు నష్టపోవడంతో పాటు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలహీనపడడంతో బంగారం బుధవారం ట్రేడింగ్‌లో లాభపడి ట్రేడవుతోంది. ఉదయం 9.36 సమయానికి యుఎస్‌ గోల్డ్‌ ప్యూచర్‌​ఔన్సు 0.48 శాతం పెరిగి 1,511 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘స్టాక్‌ మార్కెట్లో నష్టాలు పెరుగుతున్నాయి. ఫలితంగా ప్రస్తుతం గోల్డ్‌, ఇన్వెస్టర్లకు  స్వర్గదామంలా కనిపిస్తోంది’ అని యాక్టివ్‌ ట్రేడర్స్‌ చీఫ్‌ ఎనలిస్ట్‌ కార్లో ఆల్బర్టో డీ కాసా అన్నారు.  అంతేకాకుండా ఈక్విటీ మార్కెట్లు యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలు, బ్రెక్సిట్‌ గురించి అధికంగా భయపడుతున్నాయని తెలిపారు. చైనా కంపెనీలను యుఎస్‌ ప్రభుత్వం బ్లాక్‌ లిస్ట్‌ పెట్టిన చర్యపై ప్రతిచర్యను తిసుకుంటామని చైనా ప్రభుత్వం  ప్రకటించడంతో పాటు యూరోప్‌ కార్పోరేట్‌ లాభాలు బలహీనంగా ఉండడంతో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు నష్టపోయాయి. 
   ‘ప్రస్తుత పరిస్థితులలో బంగారం నిలకడగా ట్రేడవుతోంది’ అని ఓండా సీనియర్‌ మార్కెట్‌ విశ్లేషకుడు, క్రేగ్‌ ఎర్లమ్‌ అన్నారు. చైనా వైస్ ప్రీమియర్ లియు వాణిజ్య చర్చలలో భాగంగా గురువారం వాషింగ్టన్‌లో యుఎస్ వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్జైజర్, ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మునుచిన్‌లతో సమావేశం కానున్నారు. అక్టోబర్‌ 15 తర్వాత చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న 250 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై యుఎస్‌ టారీప్‌లను 25 శాతం నుంచి 30 శాతానికి పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ టారిప్‌లు అమలుకు ముందే ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతుండడంతో ఈ చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా అక్టోబర్‌లో జరగనున్న యుఎస్‌ ఫెడ్‌ సమావేశంలో ఎంత మేరకు వడ్డీ రేట్ల కోతం ఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితంగా బుధవారం జరగనున్న యుఎస్‌ ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ మినిట్స్‌పై ఇన్వెస్టర్లు దృష్ఠిసారించనున్నారు

దేశీయ ఎంసీఎక్స్‌ గోల్డ్‌: అంతర్జాతీయ అంశాలతో పాటు రూపీ డాలర్‌ మారకంలో బలహీనపడడంతో దేశీయ ఎంసీఎక్స్‌ ట్రేడింగ్‌లో ఉదయం 10.13 సమయానికి 0.19 శాతం లేదా రూ. 72 లాభపడి రూ. 38455.00 వద్ద ట్రేడవుతోంది.You may be interested

టీసీఎస్‌ ఫలితాలు.. బ్రోకరేజ్‌ల అంచనాలు...

Wednesday 9th October 2019

గురువారం దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్‌లు ఫలితాలపై ఎలాంటి అంచనాలతో ఉన్నాయో చూద్దాం.. నిర్మల్‌ బాంగ్‌ సెక్యూరిటీస్‌: యూఎస్‌ డాలర్‌ లెక్కల్లో వృద్ది 2.12 శాతం ఉంటుంది. రూపీ లెక్కల్లో నికర విక్రయాలు గతేడాదితో పోలిస్తే 6.9 శాతం మెరుగుదల చూపుతాయి. ఎబిటా గతేడాది క్యు2 కన్నా తక్కువగా 9,678 కోట్ల రూపాయలకు పరిమితం కావచ్చు. ఎబిటా మార్జిన్‌సైతం 24.6

లాభాల ప్రారంభం

Wednesday 9th October 2019

గత ఆరు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి త్రీవ నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 96 పాయింట్ల లాభంతో 37,628 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,152 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మహింద్రా, బ్రిటానియాలు 1-2 శాతం మధ్య లాభాలతో ప్రారంభంకాగా, యస్‌బ్యాంక్‌, టైటాన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌లు తీవ్ర నష్టాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. 

Most from this category