News


బంగారానికి మళ్లీ కొనుగోళ్ల మద్దతు

Wednesday 15th January 2020
Markets_main1579067949.png-30944

రెండురోజుల వరుస నష్టాల ముగింపు తర్వాత బంగారం ధరకు తిరిగి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎంసీఎక్స్‌లో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 10గ్రాములు బంగారం ధర రూ.227.00ల లాభంతో రూ.39674.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర వారం రోజుల కనిష్టస్థాయి నుంచి రికవరీ కావడం,  దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారక విలువ 14పైసల నష్టంతో ప్రారంభం కావడం లాంటి అంశాలు బంగారానికి డిమాండ్‌ పెంచాయి. అమెరికా - ఇరాన్‌ల యుద్ధ ఉద్రిక్తతలతో గడిచివారంలో బంగారం ధర రూ.41,300 వద్ద రికార్డు గరిష్టాన్ని అందుకుంది. ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టడటం, అమెరికా చైనాల మధ్య తొలిదశ ఒప్పందం కుదురుతుందనే ఆశావహన అంచనాలతో దేశీయ బులియన్‌ మార్కెట్లో ఏకంగా రూ.1200లు దిగివచ్చింది. నేటి నుండి 14, 18, 22 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన హాల్‌మార్క్‌ ఆభరణాలు, కళాఖండాలను మాత్రమే విక్రయించాలనే ప్రభుత్వ నిబంధన నేటి నుంచి అమల్లోకి రానుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్‌) లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, బంగారు ఆభరణాలకు తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి ఏడాది గడువునిచ్చింది. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సరికే 10గ్రాముల బంగారం ధర రూ.91లు నష్టపోయి రూ.39,455 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయంగా 2వారాల ‍కనిష్టం నుంచి రికవరీ:- 
చైనా ఉత్పత్తులపై టారీఫ్‌లు ప్రస్తుతానికి కొనసాగుతాయని యూఎస్ ట్రెజరీ కార్యదర్శి ప్రకటించడంతో అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ప్యూచర్ల ధర 9డాలర్లు పెరిగి 1,554డాలర్ల స్థాయిని అందుకుంది. భవిష్యత్తులో చైనా దిగుమతులపై టారీఫ్‌లు విధించకూడదనే నిమయం ఒప్పందంలో లేదు. ఒప్పందంపై సంతకాలు జరిగేంతవరకు చైనా ఉత్పత్తులపై టారీఫ్‌లు ప్రస్తుతానికి కొనసాగుతాయని యూఎస్ ట్రెజరీ కార్యదర్శి తెలిపారు. అమెరికా ఈక్విటీ మార్కెట్లకు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడవడం, అమెరికా చైనాల మద్య తొలిదశ ఒప్పందం ఈ వారంలో కుదరవచ్చనే అంచనాలతో రాత్రి అమెరికా మార్కెట్లో 6డాలర్ల నష్టపోయి 1,544 వద్ద స్థిరపడింది. You may be interested

రూ. 19వేల కోట్లివ్వండి!

Wednesday 15th January 2020

చమురు కంపెనీలను కోరుతున్న ప్రభుత్వం గతేడాదితో పోలిస్తే 5 శాతం అధికంగా రికార్డు స్థాయిలో రూ. 19000 కోట్ల డివిడెండ్‌ను ఇవ్వాలని ప్రభుత్వం పీఎస్‌యూ చమురు కంపెనీలను కోరుతోంది. విత్త పరిస్థితులు బాగాలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొత్తం చెల్లించాలని ప్రభుత్వం కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మొత్తంలో 60 శాతాన్ని చమురు కంపెనీల్లో పెద్దన్నలైన ఓఎన్‌జీసీ, ఇండియన్‌ ఆయిల్‌ చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాదితో పోలిస్తే కంపెనీల లాభాలు

కేన్‌ఫిన్‌, ఇండస్‌ఇండ్‌ వీక్‌- మైండ్‌ట్రీ ప్లస్‌

Wednesday 15th January 2020

వరుసగా సరికొత్త గరిష్టాలను అందుకుంటూ వస్తున్న దేశీ స్టాక్‌ మార్కెట్లకు బుధవారం అలుపొచ్చింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తుండటంతో మార్కెట్లు డీలాపడ్డాయి. ఉదయం 10 ప్రాంతం‍లో సెన్సెక్స్‌ 190 పాయింట్లు క్షీణించి 41,762ను తాకగా.. నిఫ్టీ 63 పాయింట్ల వెనకడుగుతో 12,299 వద్ద ట్రేడవుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి నేడు ప్రాథమిక డీల్‌ కుదరనున్న నేపథ్యంలో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగియగా..ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ

Most from this category