News


పసిడి 15 డాలర్లు జంప్‌

Friday 28th June 2019
Markets_main1561696098.png-26643

అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు పసిడి ధరకు అనుకూలిస్తున్నాయి. ఫలితంగా పతనమైన ప్రతిసారి తిరిగి ర్యాలీ చేస్తున్నాయి. పసిడి ధర ఈవారంలో 6నెలల గరిష్టం(1,433.30డాలర్లు) వద్దకు చేరుకున్న నేపథ్యంలో రెండురోజులుగా లాభాల స్వీకరణతో 1400 డాలర్ల స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే.., నేడు ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ధర అనూహ్యంగా లాభాల బాట పట్టింది. ఇంట్రాడేలో 15డాలర్ల వరకు పెరిగి 1,427.75డాలర్ల స్థాయికి చేరుకుంది. రేపు జపాన్‌లో జరిగే జీ-20 సదస్సులో ట్రంప్‌ - జీ పింగ్‌ల మధ్య జరిగే వాణిజ్య చర్చల సఫలంపై సందిగ్ధత నెలకొనడం, నేడు ఆసియా ఈక్విటీ మార్కెట్ల పతనం, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత తదితర అంశాలు పసిడి ర్యాలీకి తోడ్పాటును అందించాయి. ఉదయం గం.9:45ని.లకు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 11.25డాలర్లు పెరిగి 1,423.25డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నటి రాత్రి అమెరికా మార్కెట్ల ఫ్లాట్‌ ముగింపు నేపథ్యంలో అక్కడి మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల స్వల్ప లాభంతో 1,412.00డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగానూ అదే దూకుడు:- 
దేశీయ బులియన్‌ మార్కెట్లో పసిడి అదే దూకుడును కనబరుస్తోంది. రెండురోజుల వరుస ముగింపు స్వస్తి పలుకుతూ లాభాల బాట కెక్కింది. నేడు ఎంసీక్స్ లో ఆగ‌స్ట్ ఫ్యూచ‌ర్ కాంట్రాక్టు ప‌సిడి ధ‌ర క్రితం ట్రేడింగ్‌ ముగింపు(రూ.34, 175)తో పోలిస్తే రూ.216.00లు లాభపడి రూ.34391.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అస్థిరత వాతావరణం పసిడికి కలిసొస్తుంది. నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ధర రూ.102లు నష్టపోయి రూ.34,175లు వద్ద ముగిసింది. 



You may be interested

స్విస్‌ ఖాతాల్లో సొమ్ము తగ్గింది!!

Friday 28th June 2019

20 ఏళ్ల కనిష్ఠానికి చేరిన డిపాజిట్లు భారత ఖాతాదారులదీ అదే తీరు జ్యూరిక్/న్యూఢిల్లీ: స్విస్‌ ఖాతాల్లో భారతీయులు దాచుకునే నగదు పరిమాణం గణనీయంగా తగ్గుతోంది. 2018లో ఇది 955 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంకులకు (దాదాపు రూ. 6,757 కోట్లు) పడిపోయింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం తగ్గుదల కాగా, దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయి కూడా కావడం గమనార్హం. స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎన్‌బీ) విడుదల చేసిన గణాంకాల్లో

స్థిరంగా చమురు

Friday 28th June 2019

ఈ వారం చివరిలో అమెరికా-చైనా దేశాల మధ్య సమావేశం జరగనుండడంతో మదుపర్లు జాగ్రత్తను వహించారు. ఫలితంగా శుక్రవారం సెషన్‌లో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి.  బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.08శాతం పెరిగి బ్యారెల్‌కు 66.60 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.03శాతం నష్టపోయి 59.41 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల మధ్య సుంకాల పోరు మొదలవ్వడంతో అంతర్జాతీయంగా వృద్ధి మందగించింది. ఫలితంగా క్రూడ్‌

Most from this category