News


కొనసాగుతున్న పసిడి ర్యాలీ

Monday 28th January 2019
Markets_main1548655401.png-23846

కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ తటస్థ విధానాన్ని అవలంభివచ్చనే అంచానాలతో సోమవారం సైతం పసిడి ర్యాలీ కొనసాగుతుంది. ఆసియా ట్రేడింగ్‌లో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు ర్యాలీ చేసి 1,303డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ పతనం, అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, ఫెడ్‌ వడ్డీరేట్ల యధాతథ అంచనాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో  22.60డాలర్లు ర్యాలీ చేసిన కీలక 1300డాలర్లపై ముగిసిన సంగతి తెలిసిందే. ఈ జనవరి 29, 30 తేదిల్లో అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటి సమావేశం జరగునుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంతో పాటు గతేడాదిలో వడ్డీరేట్లను నాలుగుసార్లు పెంచిన ఫెడ్‌ ఈ ఏడాది వడ్డీరేట్ల పెంపుపై కాస్త మెతక వైఖరిని అవలంభివచ్చని మార్కెట్‌ వర్గాలు అంచానా వేస్తున్నాయి.
దేశీయంగానూ లాభాల్లోనే:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ర్యాలీ, దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం కారణంగా దేశీయంగా ఇన్వెస్టర్లు పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపారు. సోమవారం ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.175.00లు పెరిగి 32517.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ వారంలో పసిడి ధర రూ.252లు లాభపడి రూ.32343.00ల వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1.5 శాతం డౌన్‌

Monday 28th January 2019

ఐసీఐసీఐ షేర్ల పతనం బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ను దెబ్బతీసింది. ఫలితంగా సోమవారం బ్యాంకు నిఫ్టీ 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు (27,115.30)తో పోలిస్తే 1.40శాతం క్షీణతో 27,115.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  వీడియోకాన్‌కు రుణ కేటాయింపు కుంభకోణ సమస్యలు ఐసీఐసీఐ బ్యాంకును వెంటాడుతున్న నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌లోనూ ఆ బ్యాంకు షేర్లు 4.50శాతం నష్టపోయాయి. బ్యాంక్‌ నిఫ్టీలో భాగమైన యస్‌ బ్యాంక్‌ షేర్లు 4శాతం, యాక్సిస్‌

కోలుకున్న జీ ఎంటర్‌‍ప్రైజెస్‌

Monday 28th January 2019

కలిసొచ్చిన షేర్ల తనఖా ఒప్పందం కంపెనీ రుణదాతలతో షేర్ల తనఖా ఒప్పందం కుదుర్చుకోవడంతో జీ ఎంటర్‌టైన్‌మైంట్‌ షేర్లు సోమవారం రికవరీ బాట పట్టాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే షేర్లు 14శాతానికి పైగా పెరిగాయి.  జీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రమోటింగ్‌ గ్రూప్‌ అయిన ఎస్సెల్‌ గ్రూప్‌ తీవ్రఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నదనే వార్తలు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో శుక్రవారం ఆ గ్రూప్‌ షేర్లు భారీగా పతమైన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో షేరు మరింత క్షీణించినప్పటికీ.., షేర్ల విక్రయించకుండా

Most from this category