News


తెరపైకి ట్రేడ్‌వార్‌: పరుగులు పెడుతున్న పసిడి ధర

Friday 2nd August 2019
Markets_main1564721659.png-27486

అమెరికా చైనాల మథ్య మరోసారి ట్రేడ్‌ వార్‌ తెరపైకి పసిడి ధర శుక్రవారం పరుగులు పెడుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 29డాలర్లు (2శాతం) పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 300 విలువైన డాలర్ల చైనా దిగుమతులపై 10శాతం మేర పన్ను విధిస్తున్నట్లు నిన్నరాత్రి  ప్రకటించారు. ఈ విధింపు సెప్టెంబర్‌ 1నుంచి అమల్లోకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. చైనాతో జరుగుతున్న చర్చలో భాగంగా అమెరికా ప్రతిపాదించిన అధిక పరిమాణంలో యూఎస్‌ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు చైనా అంగీకరిచకపోవడంతో ఈ పన్ను విధిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఒకవేళ చర్చలు పూర్తిగా విఫలమైనట్లతే గతంలో నిలిపివేసిన  250 మిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై 25శాతం పన్ను విధింపును తక్షణమే అమల్లోకి తెస్తామని ట్రంప్‌ చైనాకు హెచ్చరికలు జారీ చేశారు. ట్రేడ్‌వార్‌తో కలిగే నష్టాల నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఫెడ్‌రిజర్వ్‌ మళ్లీ వడ్డీరేట్ల కోత తగ్గింపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్‌ అనూహ్య నిర్ణయంతో రాత్రి అక్కడి మార్కెట్లో పసిడి ధరలు రెండు వారాల గరిష్టస్థాయి 1,461.05డాలర్లను ఎగిశాయి. గరిష్టస్థాయి వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో 1,432.40 డాలర్ల స్థిరపడ్డాయి. రాత్రి లాభాల ముగింపును అందిపుచ్చుకున్న పసిడి ధర నేడు ఆసియాలో 25.35డాలర్ల లాభంతో 1,457.75డాలర్ల వద్ద ట్రేడ్‌ను ప్రారంభించిది. ఇంట్రాడేలో పసిడి ఫ్యూచర్లకు మరింత కొనుగోళ్ల మద్దతు లభించడంతో కిత్రం రోజు గరిష్టస్థాయి 1,461.05 డాలర్లను అందుకుంది. భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం 10:00లకు ఔన్స్‌ పసిడి ధర గతముగింపు ధర(రూ.1,432.40డాలర్లు)తో పోలిస్తే 13డాలర్లు పెరిగి 1445డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
దేశీయంగా రూ.35000లపైకి పసిడి ధర:- 
అంతర్జాతీయంగా పసిడి ధరలు ర్యాలీ చేయడంతో పాటు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస పతనం కారణంగా దేశీయ బులియన్‌ మార్కెట్లో పసిడి ధరలు తిరిగి రూ.35000 అందుకున్నాయి. నేడు ఎంసీఎక్స్‌ 10గ్రాముల పసిడి ఆగస్ట్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ధర 10గ్రాముల పసిడి ధర రూ.34,997.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరగడంతో రూ.148.00ల లాభపడి 35064.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి నిన్నటి రోజు ఎంసీక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.399 లాభంతో రూ.34,916ల వద్ద స్థిరపడింది. 



You may be interested

నిఫ్టీ బ్యాంక్‌..400 పాయింట్ల పతనం

Friday 2nd August 2019

మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై ఈ సెప్టెంబర్‌ 1 నుంచి 10 శాతం సుంకాలు విధిస్తామని యుఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ అనడంతో అ‍ంతర్జాతీయ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. ఫలితంగా దేశియ ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇం‍డెక్స్‌ ఉదయం 10.23 సమయానికి 394.75 పాయింట్లు పతనమయ్యి 28018.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులయిన

ట్రంప్‌ టారీఫ్‌ల హెచ్చరిక.. గడగడలాడుతున్న గ్లోబల్‌ మార్కెట్లు

Friday 2nd August 2019

మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై ఈ సెప్టెంబర్‌ 1 నుంచి 10 శాతం సుంకాలు విధిస్తామని యుఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ అనడంతో అ‍ంతర్జాతీయ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌) ఏసియా-పసిఫిక్‌ ఇండెక్స్‌(జపాన్‌ కాకుండా) షేర్లు 1.6 శాతం పడిపోయి, జూన్‌ లో తాకిన కనిష్టాలుకు చేరుకున్నాయి. జపాన్‌ నికాయ్‌ కూడా 2.4 శాతం నష్టపోయింది. చైనా మార్కెట్లు కూడా నష్టాల్లోనే

Most from this category