News


పసిడి 18డాలర్ల పతనం

Saturday 7th December 2019
Markets_main1575694452.png-30107

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 18డాలర్లు నష్టపోయింది. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించిన నమోదుకావడం పసిడి పతనానికి కారణమైంది. నిన్నరాత్రి అమెరికా నవంబర్‌ మాసపు ఉద్యోగ గణాంకాలు విడుదల చేసింది. ఈ నవంబర్‌లో 1.8లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరగవచ్చని విశ్లేషకలు అంచనా వేశారు. అయితే అంచనాలకు మించి 2.6లక్షల కొత్త ఉద్యోగ సృష్టి జరిగింది. ఈ ఏడాది జనవరి తరువాత అత్యధికంగా ఉద్యోగ కల్పన జరగడం ఇదే తొలిసారి. ఆశాజనకమైన ఆర్థిక గణాంకాలతో అక్కడి ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పయనించాయి. పసిడికి వ్యతిరేకంగా ట్రేడయ్యే డాలర్‌ బలపడింది. అలాగే ఈసారి ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత అంచనాలను తగ్గించాయి. ఈ అంశాలు పసిడి ఫ్యూచర్ల అమ్మకాలకు దారి తీశాయి. ఫలితంగా అమెరికా మార్కెట్‌ ముగిసే సరికి ఫిబ్రవరి కాంటాక్ట్‌ పసిడి ధర 18డాలర్లు (1.25శాతం) నష్టపోయి 1,465.10డాలర్ల వద్ద స్థిరపడింది. ఇక వారం మొత్తం మీద చూస్తే... ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్లు 8డాలర్లు (అరశాతం) నష్టపోయాయి. 
దేశీయంగా రూ.386.00 నష్టం:-
దేశీయంగా పసిడి ఫ్యూచర్‌ ధర నష్టాల్లో ముగిసింది. ఈ వారాంతాన్ని రూ.38వేల దిగువున ముగించాయి. రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల ఫిబ్రవరి కాంటాక్టు ధర రూ.386.00 నష్టపోయి రూ.37699.00 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయంగా పసిడి భారీ పతనం, దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడటం తదితర కారణాలు దేశీయంగా పసిడి ఫ్యూచర్లపై అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20పాయింట్లు అప్‌

Saturday 7th December 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి లాభంతో 11,975.50 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 11955.70 పాయింట్లతో పోలిస్తే 20 పాయింట్ల లాభంతో ఉంది.  నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ లాభంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక నిన్నటి రోజున సూచీలు వరుసగా రెండో నష్టాలపాలయ్యాయి. ఆర్థిక వృద్ధి భయాలు వెంటాడటం, రిజర్వ్‌బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను

ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది

Saturday 7th December 2019

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది నియమితులయ్యారు. మునుపటి చైర్మన్‌ అశోక్ చావ్లా రాజీనామా తరువాత ఈ ఏడాది జనవరి నుంచి ఈ పోస్ట్‌ ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే కాగా, శుక్రవారం చతుర్వేది చైర్మన్‌ బాధ్యతలను స్వీకరించారని ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఇందుకు సెబీ అనుమతి లభించినట్లు ప్రకటించింది. రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శిగా సేవలందించిన ఈయన

Most from this category