News


ఐదేళ్ల గరిష్టానికి పసిడి ధర

Thursday 20th June 2019
Markets_main1561013094.png-26434

వడ్డీరేట్ల తగ్గింపునకు ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు సంసిద్ధం కావడంతో పసిడి ధర పరుగులు పెడుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం పసిడి ధర ఏకంగా 5ఏళ్ల గరిష్టానికి ఎగిసింది. నేడు ఔన్స్‌ పసిడి ధర ఏకంగా 47డాలర్లు (3.50శాతం) పెరిగి 1395.35 డాలర్ల స్థాయిని తాకింది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ నిన్నరాత్రి కీలక వడ్డీరేట్లపై యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించింది. అయితే ఆర్థిక మందగమనం,  ద్రవ్యోల్బణం అంశాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైతే రానున్న రోజుల్లో వడ్డీరేట్ల కోతకు వెనకాడమని ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ స్పష్టం చేశారు. వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ మెతకవైఖరి ప్రకటనతో పసిడి ధరపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌, ట్రెజరీ ఈల్డ్స్‌పై తీవ్రంగా నష్టపోయాయి. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 6నెలల కనిష్టానికి పతనమవ్వగా, 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు ప్రపంచ ఆర్థికవృద్ధికి అవరోధంగా మారాయి. నెమ్మదించిన ఆర్థికవ్యవస్థను మెరుగుపరిచేందుకు పలు సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లపై మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. ఈ వైఖరి డాలర్‌కు ప్రతికూలంగానూ, పసిడికి సానుకూలాంశంగా మారింది. ఇప్పుడు పసిడి టార్గెట్‌ ధర 1400డాలర్లకు చేరుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉదయం గం 11:30ని.లకు ఔన్స్‌ పసిడి ధర 40డాలర్లు లాభంతో 1,389.30 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగానూ అదే దూకుడు:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 5ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో దేశీయంగా పసిడి ఫ్యూచర్లు లాభాల పట్టాయి. నేడు దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు రూ.940లు(2.50శాతం) లాభపడి రూ.33920ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. ఉదయం గం 11:30ని.లకు 10గ్రాములు పసిడి ధర రూ.789ల లాభంతో రూ.33868.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నటి ట్రేడింగ్‌లో రూ.55ల స్వల్ప లాభంతో రూ.33079ల వద్ద ముగిసింది. 



You may be interested

నష్టాల్లోంచి లాభాల్లోకి అశోక్‌ లే లాండ్‌ షేరు

Thursday 20th June 2019

అశోక్‌ లే లాండ్‌  పంట్నాగర్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని ప్రకటించాక గురువారం ఆరంభ ట్రేడింగ్‌లో షేరు విలువ 3 శాతం నష్టపోయింది. ఉత్పత్తి, అమ్మకాల మధ్య సంబంధాలలో భాగంగా కంపెనీ ఈ వ్యుహాత్మకమైన నిర్ణయం తీసుకుంది. జూన్‌ 24, 2019 నుంచి జూన్‌ 29, 2019(రెండు తేదిలు కలిపి) వరకు ఉత్పత్తిని నిలిపివేయనున్నామని కంపెనీ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. అశోక్‌ లే లాండ్‌ షేరు జూన్‌ 21, 2018న రూ.

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇంట్రాడేలో 5 శాతం లాభం‍తో..

Thursday 20th June 2019

ఎన్‌సీడీ బై బ్యాక్‌ల ప్రకటనే కారణం ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ గురువారం ఇంట్రాడేలో 5 శాతం లాభపడి రూ.582.55 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ ఈ ఏడాది జులై, ఆగష్టులలో మెచ్చ్యుర్‌ అయ్యే కన్వర్ట్‌బుల్‌ కానీ రూ.2,285 కోట్ల డిబెంచర్స్‌ను తిరిగి కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో షేరు లాభపడుతోంది. కంపెనీ లిక్విడిటీ బలంగా ఉందని సెప్టెంబర్‌ 21, 2018 నుంచి ఇప్పటి వరకు  బ్యాంక్‌ అప్పులు, బాండ్‌లు రూపేణ రూ.58,000 కోట్లు

Most from this category