సౌదీ సంక్షోభం....పసిడి పరుగు
By Sakshi

సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడి ఉద్రిక్తతలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ధర 20డాలర్ల వరకు లాభపడింది. సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరాంకోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమెన్ ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేశారు. ఈ దాడితో సౌదీ ముడి చమురు సరఫరా రోజుకు 5.7శాతం మిలియన్ బారెళ్ల మేర తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా 5శాతానికి పైగా పడిపోయింది. చమురు ధరలు 20% వరకు పెరిగాయి. అది యెమెన్ దాడి కాదని, ఇందుకు ఆధారాలు లేవని, ఇది కచ్చితంగా ఇరాన్ పనే అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. మధ్యప్రాచ్యంలో రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక సాధనమైన పసిడివైపు ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా నేడు ఆసియా ట్రేడింగ్‌లో శుక్రవారం ముగింపు(1,499.50 డాలర్లు)తో పోలిస్తే 15డాలర్ల లాభంతో 1,513.95డాలర్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 20డాలర్ల వరకు పెరిగి 1,519.65 డాలర్లను తాకింది. ఈవారంలో ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగళ(17న), బుధవారాల్లో(18న) జరగనున్నాయి. వడ్డీరేట్లపై ఫెడ్ వైఖరీ పసిడి ర్యాలీకి కీలకం కానుంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్ల కోతకే మొగ్గుచూపవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాబటి రానున్న రోజుల్లో పసిడి ధర తిరిగి ర్యాలీ చేయవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
దేశీయంగా తిరిగి రూ.38000 పైకి:-
క్రితం వారంలో రూ.38000 స్థాయిని కోల్పోయిన పసిడి ధర సోమవారం తిరిగి ఈ స్థాయిని అందుకుంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి ర్యాలీ, దేశీయ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి భారీ క్షీణతతో ఎంసీఎక్స్‌లో అక్టోబర్ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర కిత్రం వారం ముగింపు (రూ.37524.00)తో పోలిస్తే రూ.250ల లాభంతో రూ 37,774.00 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఒకదశలో రూ.639 లాభపడి రూ.38000 పైన రూ.38,163.00 గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:00లకు రూ.478.00 లాభంతో రూ.38002.00 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టడం, ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా 7రోజూ ర్యాలీ కొనసాగడంతో కిత్రంవారంలో పసిడి ధర రూ.1029 నష్టపోయి రూ.37524.00 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
You may be interested
క్రూడ్ దెబ్బ..దేశీయ ఈక్విటీల పరిస్థితేంటీ?
Monday 16th September 2019గత వారాంతంలో సౌదీ అరేబియా ఆయిల్ రిఫైనరీలపై డ్రోణ్ దాడి జరగడంతో, రాత్రికిరాత్రే సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఇది దేశియ ఈక్విటీ మార్కెట్లతో పాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై స్వల్ప కాలం వరకు ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకులు తెలిపారు. కాగా ఇండియాకు, చమురు దిగుమతులకు మధ్య ప్రతికూల సంబంధం ఉండడంతో చమురు ధరలు పెరిగితే ఇండియా దిగుమతి బిల్లులు పెరుగుతాయి. ఫలితంగా దేశ
దీర్ఘకాలానికి నిలకడైన రాబడులు
Monday 16th September 2019ఈ సమయంలో అనుకూలమైన పథకం యాక్సిస్ స్మాల్‌క్యాప్ ఫండ్ స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నవారు ప్రస్తుత సమయంలో తప్పకుండా తమ పెట్టుబడులు కొనసాగించడం ఎంతో అనుకూలం. ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంలో స్మాల్‌క్యాప్ స్టాక్స్ ఎంతో దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో వాటి విలువలు అత్యంత ఆకర్షణీయమైన స్థాయికి చేరాయి. ఫలితంగా ఈ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ధరలు కూడా తగ్గాయి. స్మాల్‌క్యాప్ విభాగంలో దీర్ఘకాలం పాటు