News


పసిడి.....8వారాల గరిష్టం

Friday 27th December 2019
Markets_main1577425806.png-30474

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 8వారాల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌ ఔన్స్‌ పసిడి ధర 4డాలర్లు పెరిగి 1,518.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాల మధ్య కుదిరిన తొలి దఫా ఒప్పందంపై అనుమాలు రేకత్తడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడటం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఇప్పటికే గరిష్టస్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో ఏ క్షణంలోనైనా లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చనే భయాందోళనలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ‘‘అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలు, ట్రంప్‌పై అభిశంసన తీర్మానం తదితర అంశాల నుంచి పసిడి సానుకూల సంకేతాలను అందుకుంటుంది. భౌతిక పసిడి కొనుగోలు కంటే పసిడి పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. వాణిజ్య ఒప్పందంపై త్వరలో సంతకం చేస్తామని అమెరికా, చైనా అధికారులు చెబుతున్నారు. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుని వివరాలు విడుదల చేసినప్పుడే పసిడి ధర పతనం జరుగుతుంది’’ బులియన్‌ విశ్లేషకుడు చింతన్‌ కర్ణాని అభిప్రాయపడ్డారు. నిన్న రాత్రి అమెరికాలో మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 9.60 డాలర్లు పెరిగి 1,514.40 డాలర్ల వద్ద స్థిరపడింది.

రూ.39వేలకి చేరువలో దేశీయ పసిడి ఫ్యూచర్లు:- 
ప్రపంచమార్కెట్లో పసిడి ధర 2నెలల గరిష్టాన్ని అందుకోవడంతో దేశీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌కు పెరుగుతోంది. నేడు దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల ధర రూ.39వేలకి చేరువలో ట్రేడ్‌ అవుతోంది. ఉదయం సెషన్‌లో ధర రూ.98లు లాభపడి రూ.38,980ని తాకింది. అమెరికాలో పసిడి భారీగా లాభపడిన నేపథ్యంలో ఇక్కడి ఎంసీఎక్స్‌ మార్కెట్లో నిన్నరాత్రి పసిడి ధర రూ.243 లాభంతో రూ.38639 వద్ద స్థిరపడింది. 



You may be interested

జనవరి సిరీస్‌ ఎలా ఉండొచ్చు?!

Friday 27th December 2019

నేడు(శుక్రవారం) ప్రారంభమైన జనవరి డెరివేటివ్‌ సిరీస్‌లో మార్కెట్ల నడక ఎలా ఉండవచ్చన్న అంశంపై సాంకేతిక నిపుణులు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుండటంతో రానున్న రెండు నెలలు మార్కెట్లకు కీలకంగా నిలిచే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సాంకేతిక విశ్లేషణలు ఎలా ఉన్నాయంటే.. బడ్జెట్‌ ఎఫెక్ట్‌ జనవరి సిరీస్‌పై బడ్జెట్‌ అంచనాలు ప్రభావం చూపనున్నట్లు పలువురు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం నిలుపుకునే అంశంతోపాటు.. మందగిస్తున్న ఆర్థిక

స్పైస్‌జెట్‌- అలుఫ్లోరైడ్‌ లాభాల్లో

Friday 27th December 2019

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లలో ఉదయం సెషన్‌లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో అందుబాటు ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్‌ కౌంటర్‌తోపాటు, అల్యూమినియం ఫ్లోరైడ్‌ తయారీ కంపెనీ అలుఫ్లోరైడ్‌ చోటు చేసుకుంది. వివరాలు చూద్దాం.. స్పైస్‌జెట్‌ లిమిటెడ్‌ గత మూడు రోజులుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న చౌక ధరల విమానయన కంపెనీ స్పైస్‌జెట్‌ షేరు మరోసారి జోరు చూపుతోంది. బీఎస్‌ఈలో 10.45 ప్రాంతంలో ఈ షేరు 3.75 శాతం

Most from this category