News


మళ్లీ 1500డాలర్లపైకి పసిడి

Thursday 31st October 2019
Markets_main1572503438.png-29257

అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను పావుశాతం తగ్గించడంతో పాటు అమెరికా చైనాల మధ్య పాక్షిక ఒప్పందంపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో పసిడి ఫ్యూచర్లకు మళ్లీ డిమాండ్‌ పెరుగుతోంది. ఫలితంగా రెండురోజుల్లో 11డాలర్ల వరకు లాభపడింది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో 1500డాలర్ల పైన 1,501.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ, ప్రస్తుతం 1.75 శాతం నుంచి 2 శాతం రేంజ్‌లో ఉన్న ‘ఫెడ్‌ ఫండ్స్‌ రేటు’ను 1.5 శాతం నుంచి 1.75 శాతానికి తగ్గించింది. ఇక ద్రవ్యోల్బణం పుంజుకునేంతవరకూ రేట్ల పెంపు ఉండకపోవచ్చంటూ ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ సంకేతాలిచ్చారు. వడ్డీరేట్ల తగ్గింపుతో నిన్నరాత్రి అమెరికాలో పసిడి ధర 6డాలర్లు పెరిగి 1496.70 డాలర్ల వద్ద ముగిసింది. నేడు ఆసియాలో మరో 5డాలర్లు పెరిగి 1,501.65 డాలర్లను తాకింది. వెరసి రెండురోజుల్లో పసిడి ధర 11డాలర్ల వరకు లాభపడ్డాయి. 
దేశీయ మార్కెట్లో స్వల్ప నష్టాల్లో:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ., దేశీయంగా మార్కెట్లో పసిడి స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం, దేశీయంగా ఈక్విటీలకు కొనుగోళ్ల మద్దతు లభించటం తదితర కారణాలు పసిడి ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. నేడు ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.13లు స్వల్ప నష్టంతో రూ.38075.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర ర్యాలీతో ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి 10గ్రాముల పసిడి ధర రూ.136ల స్వల్ప లాభంతో రూ.38042 వద్ద రూ.37,916 వద్ద ముగిసింది. 

బంగారం ధర ఏ నగరాల్లో ఎంతుందో తెలుసుకోవడానికి, ఆ నగరంపై క్లిక్‌ చేయండి.

 



You may be interested

కాగ్నిజంట్‌లో 12వేల ఉద్యోగాల కోత!

Thursday 31st October 2019

రాబోయే కొన్ని త్రైమాసికాల్లో దాదాపు 7000 ఉద్యోగాలను తగ్గించుకుంటున్నట్లు ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ తెలిపింది. దీంతో పాటు కంటెంట్‌ మోడరేషన్‌ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ వైదొలగడం కారణంగా మరో 6000 మంది ఉద్యోగాలు మాయం కానున్నాయి. వెరసి మొత్తం మీద త్వరలో కంపెనీ సుమారు 10- 12వేల ఉద్యోగాలను తగ్గించుకోనుంది. త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది. మిడ్‌ నుంచి సీనియర్‌

3నెలల గరిష్టానికి ఎస్‌బీఐ

Thursday 31st October 2019

బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ తో ప్రభుత్వరంగ బ్యాంక్‌ దిగ్గజం ఎస్‌బీఐ షేర్లు గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.300 పైకి ఎగబాకింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.293.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంక్ యొక్క ఎంటర్ప్రైజ్ విలువ, ఆస్తి నాణ్యత, అధిక వృద్ధి కారణంగా నాటికి కల్లా షేర్లు 42శాతం అప్‌సైడ్‌ అవకాశం ఉన్నట్లు పలు బ్రోకరేజ్‌ సంస్థలు పేర్కోన్నారు. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఈ షేరుకు

Most from this category