News


1850 డాలర్ల వరకూ పుత్తడి పెరగొచ్చు: గోల్డ్‌మెన్‌ శాక్స్‌

Saturday 22nd February 2020
Markets_main1582349648.png-32001

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న బలహీనత, దిగివచ్చిన యూఎస్‌ ఈల్డ్స్‌తో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 1,750డాలర్లకు చేరుకుంటుందని గోల్డ్‌శాక్స్‌ శుక్రవారం తన నివేదికలో పేర్కోంది. వ్యాధి వ్యాప్తి మరింత ఉధృతమైతే రానున్న రోజుల్లో బంగారం ధర 1850డాలర్ల స్థాయిని కూడా అందుకునే అవకాశం ఉందని గోల్డ్‌మెన్‌ శాక్స్‌ అంచనా వేసింది. 

రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర ఇంట్రాడే ఏడేళ్ల గరిష్టస్థాయి(1,651.85)ని అందుకోని చివరికి 28.30 డాలర్ల లాభంతో 1,648.80 వద్ద ముగిసింది. ఈ వారం మొత్తం మీద ఏకంగా 4శాతం లాభపడింది. మరోవైపు సప్లై చైన్‌కు అంతరాయం కలగడంతో అమెరికా ఫిబ్రవరి వ్యాపార యాక్టివిటీ 2013 తరువాత మొదటిసారి తగ్గుపట్టాయి. కరోనా వైరస్‌ వ్యాధి ప్రపంచ ఆర్థికవ్యవస్థను దెబ్బతీయడం ప్రారంభించింది అనేందుకు ఈ అంశాలు ఉదాహరణలుగా ఆర్థికవేత్తలు చెప్పుకొస్తున్నారు.

యూరోలు, ఆస్ట్రేలియన్, కెనడియన్ డాలర్లతో పాటు ఇండియన్‌ రూపాయి విలువలో కూడా బంగారం ధరలు రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. బంగారం-ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలోని హోల్డింగ్స్ వరుసగా 22వ సెషన్లలోనూ పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్ గణాంకాల చెబుతున్నాయి. బంగారం ఈటీఎఫ్‌ల్లో భారీ ప్రవాహాలు... ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చుట్టూ నెలకొన్న ఆందోళనలను సూచిస్తున్నాయని సిటిగ్రూప్ గ్లోబల్‌ ఈటీఎఫ్‌ హెడ్‌ అండ్రూ జామిసన్  అభిప్రాయపడ్డారు.

చైనా వెలుపల దేశాల్లో కరోనా వైరస్‌ వ్యాధి మరింత తీవ్రతరమైంది. దక్షిణ కొరియాలో కేసుల సంఖ్య 200లకు చేరుకోగా, జపాన్‌లో 85 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. చైనాలో అధికారులు ఈ ఫిబ్రవరిలో మూడవసారి కేసుల సంఖ్యను సర్దుబాటు చేసారు. దీంతో అధికారులు ఖచ్చితమైన గణాంకాలను చెబుతున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ప్రపంచంలోని 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో సగానికి పైగా దేశాలు ఈ ఏడాది బారీగా బడ్జెట్‌ను కోల్పోయే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద లోటు లేదా చిన్న మిగులు ఉండవచ్చని ఆర్థికవేత్త అందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్థంలో రెండు సార్లు వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉండొచ్చని కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా అభిప్రాయపడింది.You may be interested

జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు

Saturday 22nd February 2020

476.092 బిలియన్ డాలర్లుగా నమోదు ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) ఆల్‌టైం హైకి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈఏడాది ఫిబ్రవరి 14తో ముగిసిన వారంలో 3.091 బిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 476.092 బిలియన్ డాలర్లకు ఎగశాయి. అంతక్రితం వారం 1.701 బిలియన్‌ డాలర్లు పెరిగి 473 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగంగా డాలర్ల రూపంలో

ఒకేరోజు రూ.600 పెరిగిన పసిడి!

Saturday 22nd February 2020

కోవిడ్‌-19 ప్రభావంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం, రూపాయి బలహీన పడడంతో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో ఒకే రోజు పసిడి ధర రూ.600 పెరిగింది. ఎంసీఎక్స్‌లో ఇది రికార్డు స్థాయి ధర. శుక్రవారం రాత్రి 10 గ్రాముల పసిడి ధర రూ.42,666 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో 25 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,646 డాలర్ల వద్ద ముగిసింది. (శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం

Most from this category