గరిష్టస్థాయి వద్దే పసిడి
By Sakshi

నిన్నటి ట్రేడింగ్‌లో ఆరేళ్ల గరిష్టానికి ఎగిసిన పసడి ధర మంగళవారం దాదాపు అదేస్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియాలో నేడు ఔన్స్ పసిడి 1474 డాలర్ల వద్ద కదులుతోంది. గతవారంలో చైనాకు దిగుమతి అవుతున్న 300బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 10శాతం టారీఫ్‌లను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రికత్తలు మొదలయ్యాయి. ట్రంప్ ప్రకటనకు ప్రతిగా చైనా అమెరికా డాలర్ విలువను క్షీణింపజేసేందుకు తన కరెన్సీ విలువను యువాన్ విలువను పదేళ్ల కనిష్టానికి తగ్గించడంతో పాటుతో అమెరికా నుంచి దిగుమతయ్యే వ్యవసాయోత్పత్తులను బహిష్కరించమని తన దేశీయ కంపెనీలకు కోరడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో రక్షణాత్మక పెట్టుబడiులుగా భావించే పసిడికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్ పసిడి 1,486.75డాలర్లకు ఎగిసింది. 2013 సెప్టెంబర్ తరువాత పసిడి ధర ఈ స్థాయిని తిరిగి అందుకోవడం ఇదే తొలిసారి. అనంతరం గరిష్టస్థాయిలో పసిడి ఫ్యూచర్లలో కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో పసిడి ధర 1,476.50 వద్ద ముగిసింది. నేడు ఆసియాలో 1,475.60 డాలర్ల ట్రేడింగ్‌ను ప్రారంభించి స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఆసియా ఈక్విటీ మార్కెట్ల పతనం పసిడి స్థిరమైన ర్యాలీకి తోడ్పాటును అందిస్తున్నాయి.
దేశీయంగా 37000ల పైన :- ఫారెక్స్ మార్కెట్లో పసిడి ధర భారీ పతనంతో ఎంసీఎక్స్ మార్కెట్లో అక్టోబర్ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.37000ని అందుకుంది. నేడు రూపాయి రికవరితో పాటు లాభాల స్వీకరణ జరగడంతో రూ.263.00 నష్టంతో రూ.37082.00ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్న ట్రేడింగ్ ముగింపు సమయానికి పసిడి ధర 3శాతం (రూ.1074) లాభంతో రూ.37,345ల వద్ద ముగిసింది.
You may be interested
కియా కొత్తకారు ‘సెల్టోస్ విడుదల ఈ నెల 8న
Tuesday 6th August 2019ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించిన కియా కంపెనీ ప్రతినిధులు అనంతపురం ప్లాంట్‌లో కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం సాక్షి, అమరావతి: దక్షిణకొరియా కార్ల దిగ్గజం కియా కంపెనీ తన కొత్తకారు ‘సెల్టోస్’ను ఈ నెల 8న మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిని కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. కియా కంపెనీ ఎండీ కూక్ హున్ షిమ్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ థామస్ కిమ్ సోమవారం ముఖ్యమంత్రిని ఆయన
స్వల్పంగా పెరిగిన చమురు
Tuesday 6th August 2019చమురు ధరులు మంగళవారం ట్రేడింగ్‌లో పెరిగినప్పటికి, అంతర్జాతీయ వాణిజ్య భయాల వలన చమురు డిమాండ్ ఆందోళనలు మదుపర్లను వెంటాడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 10 సెంట్లు లేదా 0.17 శాతం పెరిగి బ్యారెల్‌కు 59.91 డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా డబ్ల్యుటిఐ క్రూడ్ ఫ్యూచర్స్ 7 సెంట్లు లేదా 0.13 శాతం పెరిగి బ్యారెల్‌కు 54.76 డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద చమురు వినియోగదారుల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు