బలపడిన డాలర్..నష్టాల్లో బంగారం
By Sakshi

యుఎస్-చైనా వాణిజ్య చర్చలకు ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవ్వడంతోపాటు, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్ బలపడడంతో వరుసగా మూడవ సెషన్లో కూడా బంగారం ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ మార్కెట్లో ట్రేడయ్యే బంగారం ఫ్యూచర్స్ 0.6 శాతం పడిపోయి 1495.20 డాలర్లకు దిగింది.
కరెన్సీ బాస్కెట్లో డాలర్ బలపడి 98.98 వద్ద నిలిచింది. కాగా యుఎస్-చైనా వాణిజ్య చర్చలలో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని చైనా వాణిజ్య మంత్రి ట్వీట్ చేయడంతో డాలర్ బలపడింది. చైనా వైస్ ప్రీమియర్ లియు వాణిజ్య చర్చలలో భాగంగా ఈ వారం చివరిలో వాషింగ్టన్లో యుఎస్ వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్జైజర్, ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మునుచిన్లతో సమావేశం కానున్నారు. అక్టోబర్ 15 తర్వాత చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న 250 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై యుఎస్ టారీప్‌లను 25 శాతం నుంచి 30 శాతానికి పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ టారిప్‌లు అమలుకు ముందే ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతుండడంతో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాకుండా అక్టోబర్ చివర్లో జరగనున్న యుఎస్ ఫెడ్ సమావేశంలో ఎంత మేరకు వడ్డీ రేట్ల కోతం ఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితంగా బుధవారం జరగనున్న యుఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మినిట్స్‌పై ఇన్వెస్టర్లు దృష్ఠిసారించనున్నారు.
యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరుగుతున్న అబిశంసన విచారణలో భాగంగా.. ఉక్రేయిన్ నుంచి సైనిక సహకారాన్ని విరమించుకోవడంపై పత్రాలను వెతికేందుకు పెంటగాన్, వైట్ హౌస్ బడ్జెట్ కార్యాలయానికి కోర్టునోటిసులు జారీ అయ్యాయి. ఫలితంగా యుఎస్‌లో రాజీకీయ అనిశ్చితి నెలకొంది. ఇది బంగారం ధరలకు మద్ధతుగా ఉండనుంది.
You may be interested
వాణిజ్య చర్చలకు ముందు లాభాల్లో చమురు!
Tuesday 8th October 2019గత సెషన్లో ఇండస్ట్రీయల్ కమోడిటీలు పెరగడంతో పాటు ఇరాక్, ఈక్విడార్ దేశాల ఆయిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో మంగళవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు లాభపడి ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నాం 12.36 సమయానికి బ్రెంట్ క్రూడ్ 0.67 శాతం లాభపడి బారెల్ 58.74 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్ 0.72 శాతం లాభపడి బారెల్ 53.13 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ‘రాగి, అల్యూమినియం లండన్‌లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. కానీ గత వారం తయారీ
నేడు మార్కెట్లకు సెలవు
Tuesday 8th October 2019విజయదశమి సందర్భంగా మంగళవారం(అక్టోబర్ 8) మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు పనిచేయవు. వీటితోపాటు ఫారెక్స్ మార్కెట్ కూడా పనిచేయదు. కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో మాత్రం సాయంత్రం 5గం.లకు ట్రేడింగ్ ప్రారంభవుతోంది. స్టాక్ మార్కెట్ తిరిగి యథావిధిగా బుధవారం (9న) ప్రారంభమవుతుంది. కాగా గత సెషన్ చివరిలో ఫార్మా, మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, రియల్టీ షేర్లలో అమ్మకాలు ఒత్తిడి కొనసాగడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా