News


తగ్గిన పసిడి ధరలు

Monday 19th August 2019
Markets_main1566189649.png-27845

ప్రపంచమార్కెట్లో సోమవారం పసిడి ధరలు తగ్గముఖం పట్టాయి. డాలర్‌ బలపడటం, ఈక్విటీ మార్కెట్ల రికవరీ ఇందుకు కారణమమయ్యాయి. నేడు ఆసియా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 4డాలర్లు నష్టపోయి 1520 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకు ఉద్దీపన చర్చలు ప్రకటించవచ్చనే అంచనాలతో అటు డాలర్‌తో పాటు ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. కిత్రం వారంలో ట్రేడింగ్‌ చివరిరోజైన శుక్రవారం రెండు వారాల గరిష్టాన్ని అందుకున్న డాలర్‌ ఇండెక్స్‌ నేడు ఆ స్థాయి వద్దే ట్రేడ్‌ అవుతోంది. జర్మనీ సంకీర్ణ ప్రభుత్వం తన బ్యాలెన్స్‌డ్‌ బడ్జెట్‌ రద్దు చేయడంతో పాటు రుణాల స్వీకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆర్థిక మాంద్యాన్ని భయాలను తగ్గవచ్చనే అంచనాలతో అమెరికా ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం లాభంతో ముగిశాయి. చైనా యొక్క సెంట్రల్ బ్యాంక్ సంస్థలకు రుణాలు తీసుకునే ఖర్చులను తగ్గించడంలో సహాయపడంతో కీలకమైన వడ్డీ రేటు సంస్కరణను ఆవిష్కరించింది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు సెప్టెంబర్‌లో వడ్డీరేట్లను 25బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గించే అవకాశం 69శాతం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దేశీయంగానూ తగ్గింపే:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.193ల నష్టంతో 37745.00 వద్ద ప్రారంభమైంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, ఈక్విటీ మార్కెట్ల రికవరీ పసిడి ఫ్యూచర్లపై ఒత్తిడిని పెంచుతున్నాయి.  



You may be interested

లాభాల్లో డా. రెడ్డీస్‌, సన్‌ ఫార్మా

Monday 19th August 2019

దేశియ మార్కెట్‌లు సోమవారం పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ ఉదయం 10.04  సమయానికి 1.72 శాతం లాభపడి 7,816.85 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన డా. రెడ్డీస్‌ 1.93 శాతం, దివిస్‌ ల్యాబ్‌ 1.78 శాతం, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లి. 0.48 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో సన్‌ ఫార్మా 3.54 శాతం, లుపిన్‌ 1.82 శాతం, సిప్లా 1.50 శాతం, గ్లెన్‌మార్క్‌

71.17 వద్ద రూపీ ప్రారంభం

Monday 19th August 2019

రూపీ డాలర్‌మారకంలో సోమవారం స్వల్పంగా బలహీనపడి 71.17 వద్ద ప్రారంభమైంది. కాగా అంతర్జాతీయంగా డాలర్‌ బలహీనపడడంతో పాటు దేశియ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 13 పైసలు బలపడి 71.14 వద్ద ముగిసింది. చమురు ధరలు పెరగడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 71.47 వద్ద కనిష్ఠాన్ని తాకి తిరిగి పుంజుకోవడం గమనార్హం.

Most from this category