News


దిగివచ్చిన పసిడి

Thursday 5th December 2019
Markets_main1575524315.png-30070

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం నెలరోజుల గరిష్టం నుంచి దిగివచ్చింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల్లో మొదటి దశ ఒప్పందం దాదాపు ఖరారయ్యానే అంశం పసిడికి దిగివచ్చేందుకు కారణవుతోంది. నేటి ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్పలాభంతో 1,481.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య యుద్ధానికి ఇప్పట్లో ముగింపు లభించే అవకాశాలు లేవన్న సంకేతాలతో పసిడి ధర నిన్న ఉదయం ట్రేడింగ్‌లో 1,489.85 డాలర్ల వద్ద నెలరోజుల గరిష్టాన్ని అందుకుంది. అయితే సాయంత్రం అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయమై వెలువడిన సానుకూల వార్తలు  పసిడికి డిమాండ్‌ తగ్గించాయి. ఫలితంగా నిన్నరాత్రి అమెరికాలో పసిడి ధర నెల గరిష్టం నుంచి దాదాపు 9డాలర్లు నష్టపోయి 1,480 డాలర్ల వద్ద స్థిరపడింది. 
దేశీయంగానూ రూ.38వేల పైనే:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు తగ్గట్టుగానే పసిడి ధర గురువారం దేశీయ మార్కెట్లో స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.38.00ల లాభంతో రూ.38132.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి డిసెంబర్‌ కాంటాక్టు ముగింపు రూ.38,094 వద్ద స్థిరపడింది. పసిడి మరికొద్ది రోజులు రేంజ్‌ బౌండ్‌లోనే ట్రేడ్‌ అవుతోంది. పసిడి ఫ్యూచర్లపై ఆసక్తి గల వారు పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయాలనే వ్యూహంతో రూ.38,250-38,330 స్థాయిలో కొనుగోలు చేయవచ్చని విశ్లేషకులు సలహానిస్తున్నారు. 



You may be interested

లాభాల బాటలో ఐటీ షేర్లు

Thursday 5th December 2019

మరికొద్ది సేపట్లో ఆర్‌బీఐ పాలసీ వెలువడనున్న తరణంలో సూచీల ట్రేడింగ్‌ స్తబ్ధుగా సాగుతుంది. బ్యాంకింగ్‌, ఐటీ రంగ షేర్ల ర్యాలీ సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. పాలసీ ప్రకటన అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లలో స్పష్టమైన కదలికలు గమనించవచ్చు. ఇక ఐటీ షేర్లు విషయానికొస్తే.., ఎన్‌ఎస్‌ఈలో ఈ ఐటీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 15,164.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇటీవల ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ

ఎయిర్‌టెల్‌ 400 కోట్ల డాలర్ల సమీకరణ

Thursday 5th December 2019

ఏజీఆర్‌ ఇక్కట్ల నుంచి బయటపడేందుకు ఎయిర్‌టెల్‌ సన్నాహాలు ఆరంభిస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్‌ బోర్డు బుధవారం 400 కోట్ల డాలర్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో ప్రస్తుతానికి 300 కోట్ల డాలర్లను వివిధ రూపాల్లో సమీకరిస్తారు. 200 కోట్ల డాలర్లను క్యుఐపీ మార్గంలో, వంద కోట్ల డాలర్లను ఎఫ్‌సీసీబీల జారీ ద్వారా, మరో వంద కోట్ల డాలర్లను ఎన్‌సీడీల జారీ ద్వారా సమీకరించేందుకు బోర్డు అనుమతినిచ్చింది. ఇందులో చివరి రెండు

Most from this category