News


మరింత తగ్గిన పసిడి

Tuesday 12th November 2019
Markets_main1573538262.png-29527

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర మంగళవారం 3నెలల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్ప నష్టంతో 1,456.80 డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనాతో వాణిజ్య చర్చల్లో భాగంగా తొలి దశ ఒప్పందంపై ట్రంప్‌ స్పష్టమైన వైఖరి కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. అయితే హాంగ్‌కాంగ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులు పసిడి కొంత మద్దతునిస్తున్నాయి. అమెరికా మార్కెటు నిన్నరాత్రి రికార్డు స్థాయిలో ముగిసిన నేపథ్యంలో అక్కడ పసిడి ధర 5.80డాలర్లు నష్టపోయి 1,457.10డాలర్ల వద్ద స్థిరపడింది. నేడు ట్రంప్ ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్‌లో ప్రసగించనున్న నేపథ్యంలో చైనాతో ఫేజ్-వన్ వాణిజ్య ఒప్పందంపై తన వైఖరిని తెలిపే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘ అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల పురోగతి అంశం లేదా అమెరికా ద్రవ్యోల్బణ రేటు గణాంకాలు పసిడి ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. పసిడి 1488డాలర్ల వద్ద బలమైన నిరోధ స్థాయి కలిగి ఉంది’’ అని ఏబీసీ బులియన్ గ్లోబల్ జనరల్ మేనేజర్ నికోలస్ ఫ్రాప్పెల్ అభిప్రాయపడ్డారు. గతవారంలో జరిగి వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాలు వివిధ దశల్లో సుంకాలు విధింపునకు ఇరుదేశాల ఉన్నతాధికారులు అంగీకరించారు. 
దేశీయంగా నష్టం తక్కువే:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర నిన్న దాదాపు 6డాలర్లు నష్టపోయినప్పటికీ.., దేశీయ మార్కెట్లో నిన్న స్వల్ప నష్టంతో ముగిసింది. రాత్రి ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 19 పైసలు క్షీణించడంతో నిన్నరాత్రి ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.7ల స్వల్ప నష్టంతో రూ.37680.00 వద్ద స్థిరపడింది. ఇక నేడు గురునానక్‌ జయంతి సందర్భంగా ఎంసీఎక్స్‌ ఎకే​‍్స్ఛంజ్‌లో ఉదయం ట్రేడింగ​ జరగదు. తిరిగి సాయంత్రం 5:00లకు ట్రేడింగ్‌ ప్రారంభం అవుతుంది. 

(నిన్న పసిడి ముగింపు(స్పాట్‌ ధర) కోసం ఆయా నగరాలపై క్లిక్‌ చేయండి
 



You may be interested

12000 దాటితే 12400 పాయింట్లకు నిఫ్టీ!

Tuesday 12th November 2019

నార్నొలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ అంచనా నిఫ్టీ రాబోయే రోజుల్లో 12వేల పాయింట్లను బలంగా దాటితే క్రమంగా 12400 పాయింట్ల వరకు ఎగబాకుతుందని నార్నొలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ ప్రతినిధి షబ్బీర్‌ ఖయ్యూం అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ తన స్వల్ప, దీర్ఘకాలిక డీఎంఏలకు పైన ట్రేడవుతూ బుల్లిష్‌గా కనిపిస్తోందన్నారు. కానీ గరిష్ఠాల వద్ద బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ ప్యాట్రన్‌ ఏర్పడడం అప్రమత్తతను సూచిస్తోందని చెప్పారు. నిఫ్టీకి 11700 పాయింట్ల వద్ద బలమైన మద్దతుందన్నారు. ప్రస్తుతానికి

11750- 12200 రేంజ్‌లో నిఫ్టీ!

Tuesday 12th November 2019

నవంబర్‌ సీరిస్‌పై చందన్‌ తపారియా అంచనా దేశీయ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో ఎక్కువసమయం నెగిటివ్‌జోన్‌లోనే గడిపాయి. కానీ మధ్యాహ్న అనంతరం నిఫ్టీ 11850 పాయింట్ల వద్ద మద్దతు పొంది రికవరీ సాధించి 11900 పాయింట్లపైన పాజిటివ్‌గా ముగిసింది. డైలీ చార్టుల్లో నిఫ్టీ సందిగ్దతను ప్రదర్శిస్తోంది. గత ఎనిమిది సెషన్లుగా నిఫ్టీ 11850 పాయింట్ల వద్ద మద్దతు పొందుతూ వస్తోంది. ఇదే కొనసాగినంత కాలం తక్షణ ప్రమాదం ఉండకపోవచ్చు. తదుపరి నిఫ్టీకి 12035,

Most from this category