News


బంగారం మరింత పెరిగి ఛాన్స్‌..!?

Saturday 4th January 2020
Markets_main1578124927.png-30674

గడచిన ఏడాదిలో పసిడిని కొనుగోలును నిర్లక్ష్యం చేసిన ఇన్వెస్టర్లు 18శాతం రాబడిని కోల్పోయానే నిరాశ చెందాల్సిన పని లేదు. ఇప్పటికీ సమయం మించిపోలేదని, ఈ ఏడాది ఆరంభంలో పసిడి కొనుగోలు చేస్తే సంవత్సరాంతం కల్లా 25శాతం రాబడిని పొందవచ్చని బులియన్‌ విశ్లేషకులు సలహానిస్తున్నారు. పలు దేశాల కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌లు పసిడి నిల్వల కొనుగోలుకు మొగ్గు చూపుతుండటం, అమెరికా కరెన్సీ డాలర్‌ బలహీనత, అంతర్జాతీయంగా విస్తరిస్తున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ధర ఈ 2020 చివరికల్లా 25శాతం ర్యాలీ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే అమెరికా ఎన్నికలు, అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు, ట్రంప్‌పై అభిశంసన తీర్మాన విచారణ తదితర అంశాలు పసిడి ర్యాలీకి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ఈ క్రమంలో పసిడి ధర 2011లో నెలకొల్పిన 1900డాలర్ల జీవితకాల రికార్డును అధిగమిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. 

‘‘బులియన్‌ ధరల్లో చారిత్రాత్మక ఛార్ట్‌ ప్యాట్రన్ల పునరావృతం చూస్తున్నాము. పసిడి చేసే ర్యాలీని శాతాల్లో పరిగణలోకి తీసుకుంటే... మొదటగా 1557డాలర్ల నిరోధాన్ని అధిగమిస్తుంది. కొంతకాలం పాటు 1650డాలర్ల వద్ద  స్థిరంగా కొనసాగి తదుపరి కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేస్తుంది’’ అని న్యూయార్క్‌ బులియన్‌ విశ్లేషకుడు జాన్ రోక్ అభిప్రాయపడ్డారు. 

ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు కూడా పసిడి ధర అప్‌ట్రెండ్‌ను చూస్తున్నాయి. న్యూయార్క్‌ కమోడిటి ఆధారిత కన్షల్టింగ్‌ కంపెనీ సీపీఎం గ్రూప్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ స్టేట్‌ స్ట్రీట్‌ గ్లోబల్‌ అడ్వైజర్స్‌ పసిడి ధర 1600డాలర్లు, 1650డాలర్ల పొటెన్షియల్‌ గరిష్టాన్ని అందుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. అలాగే స్విస్‌ బ్యాంక్‌ యూఎస్‌బీ సంస్థ 1600డాలర్ల అప్‌ట్రెండ్‌ సూచిస్తుంది.  

ఒకప్పుడు కేంద్ర బ్యాంక్‌లు సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక సాధనంగా డాలర్లను కొనుగోలు చేసేవి. పసిడితో పోలిస్తే డాలర్‌ ఓవర్‌వెయిట్‌ బ్యాంకులు భావిస్తున్నాయి. 2011 నుంచి 2018 వరకు ప్రతి ఏడాది సరాసరి 500 మెట్రిక్‌ టన్నలు పసిడిని కొనుగోలు చేస్తున్నాయి. గడచిన 2019 ఏడాదిలోనూ అదే ట్రెండ్‌ కొనసాగింది. ఈ ఏడాదిలోనూ రిజర్వ్‌ బ్యాంకులు పసిడిని భారీ ఎత్తున కొనుగోలు చేసే అవకాశం ఉందని స్టే్‌ట్‌ స్ట్రీట్‌ పసిడి విశ్లేషకుడు జార్జ్‌ మిల్లింగ్‌ స్టాన్లీ అభిప్రాయపడుతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లు చాలా అస్థిరతను ఎదురుకోనున్నాయి. ఎగుమతులు సులువగా ఉండేందుకు డాలర్‌ చౌకగా ఉండాలని ట్రంప్ పదేపదే సూచించడంతో డాలర్‌ విలువ పతనం అయ్యే అవకాశం ఉంది.  ఈ రెండు కారణాలు పసిడి ర్యాలీకి కలిసొచ్చే అంశాలుగా సీఎంపీ గ్రూప్‌ రోహిత్‌ సవత్‌ తెలిపారు.

పైన పేర్కోన్న అంశాలు అమెరికా, ఇరాన్‌ల మధ్య భౌగోళిక ఉద్రిక్తతల నెలకొనక ముందు జరిగిన పరిణామాలు. నాటికి ప్రపంచమార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 1520డాలర్లుగా ఉండేంది. శనివారం నాటికి 1,555.15డాలర్లుగా ఉందనే విషయాన్ని పాఠకులు గమనించాలి. You may be interested

టెన్షన్లున్నా మార్కెట్లు ముందుకే!

Saturday 4th January 2020

2020లో దేశీ మార్కెట్లపై అంచనాలు ఉమేష్‌ మెహతా, శామ్‌కో సెక్యూరిటీస్‌ అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, సామాజిక ఆందోళనలున్నప్పటికీ ఈ ఏడాది(2020)లో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల పరుగు తీయనున్నట్లు విశ్లేషకులు ఉమేష్‌ మెహతా అంచనా వేస్తున్నారు. టెన్షన్లు ఉన్నప్పటికీ గతేడాదితో పోలిస్తే మార్కెట్లు మంచి రిటర్నులు అందించే వీలున్నట్లు పేర్కొన్నారు. శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా ఒక ఇంటర్వ్యూలో వ్యక్తం చేసిన ఇతర అభిప్రాయాలు చూద్దాం..  ఇటీవల ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ సరికొత్త గరిష్టానికి

డివిడెండు చెల్లింపుల్ని పెంచుతున్న కంపెనీలివే!

Saturday 4th January 2020

సాధారణంగా ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్లలో అత్యధిక రిటర్నులు ఆశిస్తూ పెట్టుబడులకు దిగుతుంటారు. ఇదే సమయంలో కంపెనీ లాభాల నుంచి ప్రకటించే డివిడెండ్లకూ మరికొంతమంది ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తుంటారు. క్యాష్‌ఫ్లోలు మెరుగ్గా ఉండే కంపెనీలు సాధారణంగా అధిక డివిడెండ్లను అందిస్తుంటాయంటున్నారు స్టాక్‌ విశ్లేషకులు. కాగా.. అటు డివిడెండ్లు, ఇటు షేర్ల ధరల పెరుగుదల ద్వారా రెండు వైపులా లాభాలు పొందే ప్రణాళికలకూ మరికొంతమంది ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తుంటారని తెలియజేస్తున్నారు. ఈ బాటలో

Most from this category