News


స్వల్పంగా తగ్గిన పసిడి

Monday 20th January 2020
Markets_main1579495310.png-31041

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో సోమవారం పసిడి ఫ్యూచర్ల ధర స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.20ల నష్టంతో రూ.39927.00 వద్ద కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పరిమితి శ్రేణిలో కదలాడటం, నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఫ్లాట్‌ ప్రారంభం, దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు రికార్డు స్థాయి వద్ద ప్రారంభం కావడం పసిడి ఫ్యూచర్ల పరిమిత శ్రేణి ట్రేడింగ్‌కు కారణమవుతున్నాయని బులియన్‌ పండితులు అంచనా వేస్తున్నారు

బలమైన అమెరికా ఆర్థిక గణాంకాలు నమోదు కారణంగా ఇన్వెస్టర్లు రిస్క్‌ అసెట్‌లైన ఈక్విటీ మార్కెట్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. దీంతో పసిడికి డిమాండ్‌ తగ్గుతుంది. కాబట్టి నేడు ఎంసీఎక్స్‌లో పసిడి ధర నష్టాలను చవిచూసే అవకాశం ఉందని ఏంజెల్‌ కమోడిటీ బ్రోకరేజ్‌ అభిప్రాపడింది.

గతేడాది(2019)డిసెంబర్‌లో రూ.17564 కోట్ల పసిడి దిగుమతులు జరిగినట్లు గణాంకాలు వెలువడ్డాయి. అంతకుముందు ఏడాది(2018)డిసెంబర్‌లో దిగుమతితో పోలిస్తే 3.30తక్కువ. 

అంతర్జాతీయంగానూ పరిమిత శ్రేణిలోనే:- 
ఈక్విటీ మార్కెట్లు గరిష్టస్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పరిమిత శ్రేణిలో కదలాడుతుంది. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్పలాభంతో 1,559.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా బలమైన ఆర్థిక గణాంకాలు నమోదు కారణంగా శుక్రవారం అక్కడి ఈక్విటీ మార్కెట్లు రికార్డు గరిష్టస్థాయిలను అందుకోవడంతో పాటు లాభాలతో ముగిశాయి. అక్కడి నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న ఆసియా ఈక్వీటీ మార్కెట్లు సైతం 20నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఈక్విటీ మార్కెట్ల రికార్డు స్థాయిలో ట్రేడ్‌ అవుతుండంతో పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు డిమాండ్‌ తగ్గింది. 



You may be interested

ఎయిర్‌టెల్‌ షేరు మరింత పెరగనుందా?

Monday 20th January 2020

మరో 8 శాతం బలపడే చాన్స్‌ సాంకేతిక నిపుణుల అంచనాలు 11 ఏళ్ల కన్సాలిడేషన్‌ తదుపరి బ్రేకవుట్‌ దశాబ్ద కాలానికిపైగా కన్సాలిడేషన్‌ బాటలో సాగిన దేశీ మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ కౌంటర్‌ మరింత బలపడనుందంటున్నారు సాంకేతిక నిపుణులు. సమీప కాలంలో 8 శాతం వరకూ పుంజుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. స్టాక్‌ ఫ్యూచర్స్‌లో ఓపెన్‌ ఇంట్రస్ట్‌ 14 నెలల గరిష్టానికి చేరడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏజీఆర్‌ బకాయిలపై టెల్కోల రివ్యూ

12,400పైన నిలిస్తే నిఫ్టీ జోరు?!

Monday 20th January 2020

ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ అంచనా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇం‍డెక్స్‌ నిఫ్టీ 12,400 పాయింట్లకు ఎగువన నిలవగలిగితే.. తదుపరి మరింత జోరందుకునే వీలున్నట్లు ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ తాజాగా అంచనా వేసింది. అంచనాలు ఇలా.. గత వారం నిఫ్టీ కొత్త గరిష్టాలకు చేరింది. 13,352 వద్ద ముగిసింది. వారపు చార్టుల ప్రకారం చిన్న బుల్లిష్‌ కేండిల్‌ కనిపిస్తోంది. అయితే బ్యాంక్‌ నిఫ్టీ రికార్డ్‌ గరిష్టానికి చేరడంలో విఫలమైంది. గత వారం నికరంగా 1.6 శాతం క్షీణించి 31,591

Most from this category