News


4రోజుల నష్టాల తరువాత లాభాల్లోకి పసిడి

Wednesday 13th November 2019
Markets_main1573623224.png-29554

నాలుగు రోజుల వరుసగా నష్టాల ముగింపు అనంతరం బుధవారం ఉదయం సెషన్‌లో లాభాల బాట పట్టింది. గత రెండు రోజులుగా 3నెలల కనిష్టం వద్ద ట్రేడైన పసిడి ధర బుధవారం లాభపడింది. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 6.50డాలర్ల పెరిగి 1,460.25 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో చైనాతో వాణిజ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో మార్కెట్లు వర్గాలు చైనాతో ఒప్పందానికి ట్రంప్‌ సుముఖంగా లేనట్లు భావిస్తున్నారు. హాంగ్‌కాంగ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పసిడికి మద్దతునిస్తుంది. నేటి రాత్రి అమెరికాలో ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ కాంగ్రెస్ జాయింట్‌ ఎకనామికల్‌ కమిటీ ముందు ఆర్థిక అవుట్‌లుక్‌పై ప్రసంగించున్నారు. ఈ ప్రసంగం బులియన్‌, ఈక్విటీ ఇన్వెస్టర్లకు కీలకం కానుంది. అయితే డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో నెలరోజుల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం పసిడికి ప్రతికూలంగా మారింది. నిన్నరాత్రి డాలర్‌ బలపడటం, అమెరికా సూచీలు కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకిన నేపథ్యంలో అక్కడి మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 3.40 డాలర్లు నష్టపోయి 1,453.70 డాలర్ల వద్ద స్థిరపడింది.
దేశీయంగా రూ.100పైగా లాభం:- 
అంతర్జాతీయంగా పసిడి ధర పెరగడం, దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనపడటం తదితర కారణాలతో దేశీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.103.00లు పెరిగి రూ.37823.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక నిన్న గురునానక్‌ జయంతి సందర్భంగా ఎంసీఎక్స్‌ మార్కెట్‌ సాయంత్రం వరకు సెలవు. అనంతరం సాయంత్రం 5:00లకు ప్రారంభమైన పసిడి రాత్రి ట్రేడింగ్‌ ముగిసే సరికి రూ.28ల స్వల్పలాభంతో రూ.37,708 వద్ద స్థిరపడింది. 

నిన్నటి రోజున పసిడి(24 క్యారెట్లు) ముగింపు ధర కోసం ఆయా నగరాల గుర్తుపై క్లిక్‌ చేయండి(స్పాట్‌)


 



You may be interested

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌ పోటాపోటీ..!

Wednesday 13th November 2019

స్వల్ప హెచ్చుతగ్గులతో ఊగిసలాడుతున్న బుధవారంనాటి మార్కెట్లో అధిక వెయిటేజీ కలిగి, భారత్‌ మార్కెట్లో అత్యధిక మార్కెట్‌ కేపిటలైజేషన్‌ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌ షేర్లు పోటాపోటీగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన ఇండెక్స్‌ అయిన నిఫ్టీ-50 ఇండెక్స్‌లోని టాప్‌-5 గెయినర్లలో బ్రిటానియా ఇండస్ట్రీస్‌ తరువాతి స్థానాల్లో ఈ రెండు షేర్లు  ట్రేడ్‌ అవుతున్నాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్‌కు నిఫ్టీలో వెయిటేజీ తక్కువకాగా, అధిక వెయిటేజి కలిగిన  రిలయన్స్‌, టీసీఎస్‌ షేర్లు చెరో 3శాతం ర్యాలీ చేయడం

ఫలితాల ఎఫెక్ట్‌: బ్రిటానియా 5% అప్‌

Wednesday 13th November 2019

బ్రిటానియా సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో బుధవారం సెషన్లో ఈ కంపెనీ షేరు ర్యాలీ చేస్తోంది. ఉదయం 10.55 సమయానికి బ్రిటానియా  5.21 శాతం లాభపడి రూ. 3,282.20 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 లో ఈ షేరు టాప్‌ గెయినర్‌గా ఉండడం గమనార్హం.  గత సెషన్‌లో రూ. 3,119.55 వద్ద ముగిసిన ఈ షేరు, ఫలితాల ప్రభావంతో బుధవారం సెషన్‌లో రూ. 3,271.00 వద్ద పాజిటివ్‌గా

Most from this category