పసిడి భవితపై ‘ఫెడ్’ రేటు ప్రభావం
By Sakshi

అమెరికా ఆర్థిక పరిస్థితి, కీలక వడ్డీ రేట్లపై (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) బుధవారం (20వ తేదీ) ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షా కమిటీ తీసుకునే నిర్ణయంపై పసిడి సమీప భవిష్యత్ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్- నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) 1,200 డాలర్ల నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత కీలకమైన 1,300 డాలర్ల లోపునకు పడిపోయినా, పటిష్టంగా కొనసాగుతోంది. 15వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 4 డాలర్ల లాభంతో 1,302 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక వృద్ధి, డాలర్ కదలికలు (15వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 96), అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాలపై తదుపరి పసిడి కదలికలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే సమీపకాలంలో పసిడి ధోరణి పటిష్టంగానే ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. దేశంలో 32-33 వేల మధ్య స్థిరీకరణ ...
కాగా డాలర్ మారకంలో రూపాయి పటిష్టత దేశీయ పసిడి ధరపై ప్రభావం చూపుతోంది. దేశీయ ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం 24పైసలు లాభపడి 69.10కి చేరిన సంగతి తెలిసిందే. గడచిన ఐదు రోజుల్లో 104 పైసలు బలపడింది. అందువల్ల పసిడి అంతర్జాతీయ భారీగా పెరిగినా, దేశీయంగా సమీప కాలంలో అంతర్జాతీయ పెరుగుదల ధోరణి పూర్తిస్థాయిలో ప్రతిబింబించవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అయితే ఆయా అంశాల నేపథ్యంలోదేశీయంగా పసిడి 10 గ్రాముల ధర రూ.32,000-33,000 మధ్య స్థిరీకరణ పొందవచ్చన్నది విశ్లేషణ. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం రూ. 31,826 వద్ద ముగిసింది. కాగా ముంబై స్పాట్ మార్కెట్లో 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా రూ.32,870, రూ.31,300 వద్ద ముగిశాయి.
You may be interested
ఎఫ్ఐఐల పెట్టుబడులే కీలకం..
Monday 18th March 2019-ఎఫ్ఐఐల పెట్టుబడులే కీలకం.. - మంగళ, బుధవారాల్లో అమెరికా ఫెడ్ సమావేశం - వడ్డీ రేట్లపై ప్రకటన, ఆర్థిక అంచనాల వెల్లడి - బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీఓఈ) వడ్డీ రేట్ల నిర్ణయం కూడా ఈవారంలోనే.. - మంగళవారం దేశీ క్యూ3 కరెంట్ ఖాతా లోటు ప్రకటన - ఈ అంశాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్న ఎఫ్ఐఐలు - హోలీ సందర్భంగా 21న (గురువారం) మార్కెట్లకు సెలవు ముంబై: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) భారత స్టాక్ మార్కెట్లలో
విశ్రాంత జీవనానికి సోపానం
Monday 18th March 2019భారీ నిధి సమకూర్చుకోవాలి ఉద్యోగం ఆరంభం నుంచే ఇందుకు ప్రణాళిక ఎంచుకున్న సాధనాల్లో క్రమం తప్పకుండా పెట్టుబడులు దాంతో భవిష్యత్తు అవసరాలకు తగినంత భద్రత అందుబాటులో మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ పెన్షన్ ఫండ్స్ యూనిట్ లింక్డ్ పెన్షన్ప్లాన్లు, పీపీఎఫ్, ఎన్పీఎస్ ఒక్కో సాధనంలో భిన్న ప్రయోజనాలు వేతన జీవులు అందరూ తాము రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నిశ్చింతగా జీవించేందుకు ముందుగానే ప్రణాళిక బద్ధంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఈ విషయమై ఇటీవలి సంవత్సరాల్లో అవగాహన విస్తృతం అవుతోంది. దీంతో రిటైర్మెంట్