News


ట్రేడ్‌ డీల్‌ ఎఫెక్ట్‌: పసిడికి తగ్గిన డిమాండ్‌

Monday 16th December 2019
Markets_main1576477324.png-30247

అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు తగ్గముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌కు తగ్గుతోంది. నేటి ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌  పసిడి ధర 4డాలర్లు నష్టపోయి 1477 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆర్థికంగా అగ్రరాజ్యాలైన  అమెరికా చైనాల మధ్య 17నెలలుగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తాత్కలికంగా తెరదించుతూ ఇరుదేశాలు గతవారంలో మధ్యంతర ఒప్పందాన్ని కుదరుర్చుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రిస్క్‌ అసెట్స్‌గా పిలువబడే ఈక్విటీల్లో వైపు మళ్లిస్తున్నారు.  ఫలితంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గుతోంది. 

వాణిజ్య చర్చల్లో భాగంగా మొదటి దశ ఒప్పందం శుక్రవారం కుదిరింది. అయితే ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి తేదీని అధికారులు ఇంకా నిర్ణయించలేదు. ఈ ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సిన చైనా దిగుమతులపై సుంకాలను అమెరికా నిలిపివేసింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్జైజర్ ఆదివారం మాట్లాడుతూ  చైనాకు అమెరికా ఎగుమతులు వచ్చే రెండేళ్లలో దాదాపు రెట్టింపు అవుతాయిని ప్రకటించారు. 

మరోవైపు గతవారం బ్రిటన్‌ ప్రధానిగా మరోమారు ఎన్నుకోబడిన బోరిస్‌ జాన్సస్‌ వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి బ్రిగ్జిట్‌ ప్రక్రియ ముగిస్తుందని ప్రకటించారు. అలాగే వచ్చే ఏడాది 2020 నాటికి యూరోపియన్‌ యూనియన్‌ నుంచి కొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటాని తెలిపారు. 

డాలర్ బలహీనతకు తోడు బాండ్‌ ఈల్డ్స్‌ పతనంతో గతవారం ట్రేడింగ్‌ చివరి రోజైన శుక్రవారం అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు 1,481.20 డాలర్ల వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే.

దేశీయంగా స్వల్ప లాభాల్లో పసిడి:- అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి నష్టాల బాట పట్టినప్పటికీ.., దేశీయంగా స్వల్పంగా లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఎంసీక్స్‌ మార్కెట్లో సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.95లు లాభంతో రూ.37867.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. పసిడిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపే రూపాయి విలువ 14పైసలు బలహీనపడటం దేశీయంగా పసిడి ఫూచర్లకు డిమాండ్‌ నెలకొందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పెరగడంతో పాటు దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ అక్కడిక్కడే ముగియడంతో శుక్రవారం రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల ఫిబ్రవరి కాంటాక్టు ధర రూ.229 లాభపడి రూ.37773.00 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. 



You may be interested

ఎస్‌బీఐ క్యాప్‌ నుంచి రెండు రికమండేషన్లు

Monday 16th December 2019

లాంగ్‌టర్మ్‌కోసం రెండు షేర్లను ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి మహంతేశ్‌ సబారద్‌ సిఫార్సు చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈక్విటీలు మంచి ప్రదర్శన చూపుతాయని, స్వల్పకాలానికి మాత్రం మార్కెట్‌లో జోరు తెచ్చే ట్రిగ్గర్స్‌ ఏమీ లేవని అభిప్రాయపడ్డారు.  1. అతుల్‌ లిమిటెడ్‌: టార్గెట్‌ రూ. 5000. ఇటీవలే ఈ షేర్ల కవరింగ్‌ మొదలుపెట్టామని మహంతేశ్‌ చెప్పారు. లైఫ్‌సైన్సెస్‌ నుంచి ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ వరకు పలు ఉత్పత్తులు సంస్థ తయారు చేస్తోంది. విక్రయాలు క్రమంగా

నిఫ్టీలో లాంగ్‌ కాల్‌ బటర్‌ఫ్లై వ్యూహం!

Monday 16th December 2019

నిపుణుల సలహా నిఫ్టీ షార్ట్‌టర్మ్‌కు బలంగా కనిపిస్తోందని ప్రముఖ అనలిస్టు శుభం అగర్వాల్‌ చెప్పారు. కీలక 12వేల వద్ద పుట్‌రైటింగ్‌ ఎక్కువగా ఉందన్నారు. పైస్థాయిలో పెద్దగా చెప్పుకోదగ్గ ఆటంకాలేవీ లేవని అభిప్రాయపడ్డారు. నిఫ్టీలాంటి నిర్మాణమే బ్యాంకు నిఫ్టీలో 32వేల పాయింట్ల వద్ద కనిపిస్తోందన​ఆనరు. వీఐఎక్స్‌ సైతం 13 స్థాయిల వద్ద ఉండడం స్వల్పకాలిక బుల్లిష్‌నెస్‌కు సంకేతంగా చెప్పారు. ఈ సమయంలో లాంగ్‌ కాల్‌ బటర్‌ఫ్లై వ్యూహం అవలంబించడం ఉత్తమమని సలహా ఇచ్చారు.  వ్యూహం.. 12100

Most from this category