News


పసిడి మరో కొత్త రికార్డు

Thursday 20th February 2020
Markets_main1582172764.png-31950

కోవిడ్‌-19 ప్రభావంతో గత నాలుగు వారాలుగా పెరుగుతూ వస్తున్న పసిడి అంతర్జాతీయ మార్కెట్‌లో  గురువారం ఏడేళ్ల గరిష్టానికి చేరింది. దేశీయ మల్టీకమోడిటీ ఎక్సెంజ్‌లో పసిడి రూ.41,700 పైకి చేరింది. గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ.200 పెరిగి 10 గ్రాముల పసిడి రూ. 41,722.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో  నిన్నటి ముగింపుతో పోలిస్తే 2 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,613.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే ఇండియాలో పసిడి ధర అధికంగా పెరగడానికి రూపాయి క్షీణతే కారణం. గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో డాలరువిలువ పెరగడంతో రూపాయి విలువ 25 పైసలు పడిపోయి 71.75 వద్ద కదులుతోంది.

(బుధవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)
 



You may be interested

డాలర్‌ అప్‌- రూపాయి కుదేల్‌

Thursday 20th February 2020

ప్రారంభంలోనే నేలచూపు వరుసగా రెండో రోజు డీలా ఇటీవల బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ మరోసారి నేలచూపులతో ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో ప్రారంభంలోనే రూపాయి 23 పైసలు నీరసించింది. 71.79 వద్ద మొదలైంది. 9.40 ప్రాంతంలో 22 పైసలు(0.33 శాతం) క్షీణించి 71.78 వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడు వారాల కనిష్టంకాగా.. ఇంతక్రితం జనవరి 8న రూపాయి ఈ స్థాయిలో ట్రేడైనట్లు ఫారెక్స్‌ వర్గాలు తెలియజేశాయి. చత్రపతి శివాజీ

స్వల్ప నష్టంతో మొదలైన మార్కెట్‌

Thursday 20th February 2020

దేశీయ మార్కెట్‌ గురువారం స్వల్ప నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 50 పాయింట్ల నష్టంతో 41273 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లను కోల్పోయి 12105.9 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్నటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాల్ని ఆర్జించినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తాజాగా కోరోనావైరస్‌ భయాలతో ప్రతికూల సంకేతాలు వెలువడుతున్న కారణంగా దేశీయ స్టాక్‌ సూచీలు బలహీనంగా మొదలయ్యాయి.  అలాగే ఈ ఫిబ్రవరి 6-9 తేదీల్లో జరిగిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ

Most from this category