News


బంగారం... 1,300 డాలర్లకు వచ్చే అవకాశం!

Monday 23rd March 2020
Markets_main1584933196.png-32625

అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురయితే, పసిడి ధర వేగంగా పెరగడం సహజం. ఆర్థిక వ్యవస్థపై నిజానికి ‍కోవిడ్‌-19(కరోనా) వైరస్‌  ప్రభావం కారణంగా అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌-నైమెక్స్‌లో ఔన్స్‌ (31.1గ్రా) ధర ఈ నెల మొదట్లో పసిడి ఎనిమిది సంవత్సరాల గరిష్టం 1,704 డాలర్లను తాకింది. అయితే అటు తర్వాత పెట్టుబడులకు సురక్షిత సాధనంగా భావించే ఈ మెటల్‌ నుంచి కూడా డబ్బును ఇన్వెస్టర్లు ఉపసంహరించి డాలర్‌లోకి పంప్‌ చేయడం ప్రారంభించారు. దీనితో ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ 103 స్థాయి దాటేసింది(52 వారాల కనిష్టం 95.61). పసిడి 20వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 1,501 డాలర్ల వద్ద ముగిసింది. ఒక దశలో 1,460 డాలర్ల స్థాయినీ చూసింది. పసిడి 52 వారాల కనిష్టం 1,266 డాలర్లు కావడం గమనార్హం.  

బులిష్‌ ధోరణే...
ఇప్పుడు పసిడి దారి ఎటువైపన్న వాదన ఉంది. భారీగా పెరిగిన పసిడి నుంచి ప్రస్తుతం లాభాల ఉపసంహరణే జరుగుతోంది తప్ప, మెటల్‌ బేరిష్‌ ధోరణిలోకి వెళ్లలేదన్నది పలువురి అభిప్రాయం. ఒకవేళ అలా అయినా మహాఅయితే మరో 150 డాలర్లు పతనం కావచ్చని, 1,360, 1,300 డాలర్లు పసిడికి పటిష్ట మద్దతని వాదనలు ఉన్నాయి. మార్జిన్ల సమస్యలేనివారికి పసిడి కొనుగోళ్లకు ఇది సువర్ణ అవకాశమని యూబీఎస్‌ గ్రూప్‌లో కమోడిటీ, ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వానీ గార్డెన్‌ పేర్కొంటున్నారు. పలు సెంట్రల్‌ బ్యాంకులు సరళతర ఆర్థిక విధానాలు, దిగువస్థాయిల వడ్డీరేట్ల పద్దతులు అనుసరిస్తున్న నేపథ్యంలో తిరిగి పసిడి భారీగా పెరగడం ఖాయమన్నది ఆయన విశ్లేషణ. కోవిడ్‌-19 ప్రభావంతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమై కరెన్సీ యుద్ధం ప్రారంభమయిన పక్షంలో పసిడే ఇన్వెస్టర్లకు ఏకైక పెట్టుబడి సాధనమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. పైగా 1,200 డాలర్లు పసిడికి స్వీట్‌స్టాప్‌ అన్న సంగతినీ మరికొందరు ప్రస్తావిస్తున్నారు. You may be interested

సెన్సెక్స్‌ 2700 పాయింట్లు క్రాష్‌..!

Monday 23rd March 2020

కరోనా వ్యాధి భయాలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ను వీడటం లేదు. దీంతో సోమవారం సైతం ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 27వేల మార్కును, నిఫ్టీ నిఫ్టీ 8వేల స్థాయిని కోల్పోయాయి. డాలర్‌ మారకంలో రూపాయి సరికొత్త కనిష్ట స్థాయికి పతనమైంది. శుక్రవారం ముగింపు స్థాయి(75.19)తో పోలిస్తే 50 పైసలు బలహీనపడి 75.69 వద్ద ప్రారంభమైంది.  కరోనా వైరస్‌ విస్తరించకుండా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నట్లు గుర్తించిన

స్టాక్స్‌లో నష్టపోకూడదంటే..?

Monday 23rd March 2020

కొన్ని తప్పులకు దూరంగా ఉండాలి అనుకూల సమయం ఎప్పుడదన్నది చెప్పలేం అప్పటి వరకూ వేచి చూస్తేనే లాభాలు స్థాయిని మించి రిస్క్‌ తీసుకుంటే ప్రమాదమే వైవిధ్యం లేకపోతే నష్టాలకు చాన్స్‌ తగినంత అధ్యయనం లేకుండా ఇన్వెస్ట్‌ చేయరాదు సంపద కూడబెట్టుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అందులో ఈక్విటీలది అగ్ర తాంబూలం. మార్కెట్‌ పతనాలే మంచి పెట్టుబడి అవకాశాలను తెచ్చిపెడతాయి. గతంలో భారీ పతనాలు ఎన్నో వచ్చి వెళ్లాయి. ఈక్విటీ మార్కెట్లు పడి లేచిన బంతి మాదిరిగా ఆ పతనాల నుంచి

Most from this category