News


రూ.400 తగ్గిన పుత్తడి

Wednesday 29th January 2020
Markets_main1580278282.png-31301

రూ.400 తగ్గిన బంగారం 
కరోనా వైరస్‌ ప్రభావంతో గత కొద్ది రోజులుగా అమాంతం పెరిగిన బంగారం ధరలు బుధవారం దిగివచ్చాయి. బుధవారం 10.45 గంటల ప్రాంతంలో క్రితం రోజుతో పోలిస్తే ఎంసీఎక్స్‌లో రూ. 400 తగ్గుదలతో 10 గ్రాముల పసిడి 40,091.00వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గడం, రూపాయి పుంజుకోవడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రితం రోజుతో పోలిస్తే 14 డాలర్లు తగ్గి  ఔన్స్‌ బంగారం ధర 1,565.05 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

(మంగళవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

బడ్జెట్‌ ముందు నిఫ్టీ టెక్నికల్స్‌ ఎలా ఉన్నాయి?

Wednesday 29th January 2020

నిరాశపరిస్తే పతనం భారీగా ఉంటుందంటున్న నిపుణులు ఈ వారాంతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌పై మార్కెట్లో భారీ ఆశలున్నాయి. ఎకానమీలో పునరుజ్జీవం తెచ్చేందుకు పలు చర్యలను బడ్జెట్లో ప్రకటించవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ రెండుమూడు దినాలు మార్కెట్లు పాజిటివ్‌గానే ఉండే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీ గతవారం ఆల్‌టైమ్‌ హై 12400 పైన నిలబడలేకపోయింది. ప్రస్తుతం టెక్నికల్స్‌ చూస్తే నిఫ్టీ వీక్లీ చార్టుల్లో బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ ప్యాట్రన్‌ ఏర్పడింది.

తప్పు చేయకుంటే.. భయమక్కర్లేదు

Wednesday 29th January 2020

బ్యాంకర్లకు కేంద్రం భరోసా న్యూఢిల్లీ: మొండిబకాయిల (ఎన్‌పీఏ) తీవ్రత, మోసాలు పెరగడం వంటి పరిస్థితుల్లో  ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అని భయాందోళనలకు గురవుతున్న బ్యాంకర్లకు భరోసా లభించింది. తీసుకున్న నిర్ణయం విషయంలో వైఫల్యం ఉన్నా... అందులో దురుద్ధేశాలు లేనట్లయితే బ్యాంకర్లు భయపడాల్సిన పనిలేదని సంకేతాలిస్తూ, కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. బ్యాంక్‌ అధికారులు కొందరు పాల్పడే భారీ మోసాలపై తీసుకునే చర్యల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎండీ, సీఈఓలను

Most from this category