News


స్టాక్స్‌ కన్నా బంగారమే బెటర్‌!

Tuesday 31st December 2019
Markets_main1577769495.png-30554

ఈక్విటీల్లో అప్‌ట్రెండ్‌ తాత్కాలికమే
2020లో పసిడి ర్యాలీ పక్కా
ఒకపక్క సురక్షిత పెట్టుబడిసాధనంగా పేరొందిన బంగారం ధర పెరుగుతోంది.. మరోపక్క ఈక్విటీలు ప్రపంచవ్యాప్తంగా అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తున్నాయి. దీంతో సాధారణ మదుపరి ఈక్విటీల్లో పెట్టుబడులకు వెనకముందూ ఆలోచిస్తున్నాడు. సాధారణంగా బంగారం ధర పెరగడం, ఈక్విటీల్లో డౌన్‌ట్రెండ్‌కు సంకేతంగా భావిస్తారు. ఈక్విటీలు ర్యాలీ జరిపే సమయాల్లో బంగారం ధర నేల చూపులు చూస్తుంటుంది. కానీ ఈసారి తద్భిన్నంగా రెండూ ర్యాలీ జరుపుతుండడం ఇన్వెస్టర్లలో అయోమయం పెంచుతోంది. వీటిలో ఏది స్థిరంగా ముందుకు ర్యాలీ జరుపుతుంది, ఏది వెనకంజ వేస్తుందన్న సందేహంలో పడ్డారు. చార్టులు పరిశీలిస్తే బంగారంలో ర్యాలీనే కొనసాగవచ్చని ఎక్కువమంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ఏడాది ప్రపంచ ఎకానమీలో మందగమనం కొనసాగవచ్చని అందువల్ల మెటల్స్‌ ముఖ్యంగా బంగారంలో అప్‌మూవ్‌ ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈక్విటీల్లో కొనసాగుతున్న అప్‌ట్రెండ్‌ కేవలం ఆశలతో ఏర్పడుతున్నదేనని, దీనికి ఎలాంటి ఫండమెంటల్‌ సపోర్ట్‌ లేదని నిపుణుల విశ్లేషణ. అందువల్ల బంగారంలో ర్యాలీనే స్థిరంగా కొనసాగుతుందని చెబుతున్నారు.
టెక్నికల్స్‌...


బంగారం ధరకు కొన్ని నెలలుగా 1600 డాలర్ల వద్ద నిరోధం ఎదురవుతోంది. ఈ నిరోధాన్ని విజయవంతంగా దాటగలిగితే వేగంగా 1750 డాలర్లకు చేరవచ్చని టెక్నికల్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దశలో కొంత స్థిరీకరణకు అవకాశం ఉంటుందని, ఆపైన 2000 డాలర్ల వరకు పసిడి పరుగు ఉంటుదని భావిస్తున్నారు. దిగువన 1480- 1510 డాలర్ల వద్ద బలమైన మద్దతు బంగారానికి లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రిస్కులను బట్టి చూస్తే బంగారం ధర చాలా తక్కువ వద్ద ట్రేడవుతోందని అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భావిస్తున్నారని, అందుకే ఇకపై బంగారంలో పెట్టుబడులు బాగా పెరుగుతాయని కమోడిటీ నిపుణుల అంచనా. మెటల్స్‌లో అప్‌మూవ్‌ ఇప్పుడే ఆరంభమైందంటున్నారు. ఈ క్రమంలో తొలత బంగారం ధర 1650, 1700 డాలర్లకు ఆపై 1750, 1800 డాలర్లకు పరుగులు తీస్తుందని పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాదిలోనే 2000 డాలర్లను కూడా తాకవచ్చని అభిప్రాయపడుతున్నారు. You may be interested

2020లో ఈ సూత్రాలు మర్చిపోకండి

Tuesday 31st December 2019

కొత్త ఏడాది ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మదుపరులు తప్పక గుర్తుంచుకోవాల్సిన నాలుగు సూత్రాలను నిపుణులు వివరిస్తున్నారు.  1. క్వాలిటీనే కీలకం: సైక్లిక్స్‌ మార్కెట్లో మార్పులు తీసుకువస్తుంటాయి, కానీ ఎప్పుడూ కాలపరీక్షకు నిలిచేది క్వాలిటీ మాత్రమే. నాణ్యమైన స్టాకులు మార్కెట్‌ ఆటుపోట్లను తట్టుకుంటాయని మరచిపోకండి.  2. రిస్కు- రివార్డు: మార్కెట్లో కేవలం వాల్యూషన్లు మాత్రమే పరిశీలించి నిర్ణయం తీసుకోకుండా రిస్కు- రివార్డు నిష్పత్తిని సైతం లెక్కించి నిర్ణయం తీసుకోవాలి. బలమైన యాజమాన్యం, స్థిరమైన

చాలెట్‌ హోటల్స్‌ దూకుడు

Tuesday 31st December 2019

ప్రపంచ మార్కెట్ల బలహీనతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. ఇటీవల రికార్డుల ర్యాలీ చేసిన పలు మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇండెక్సులు డీలా పడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. మంగళవారం ట్రేడింగ్‌లో వార్తల ఆధారంగా చాలెట్‌ హోటల్స్‌, కల్పతరు పవర్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. చాలెట్‌ హోటల్స్‌ ఆతిథ్య రంగ గ్లోబల్‌ కంపెనీ

Most from this category