News


ఈ నెల కనిష్టం వద్ద పసిడి ధర

Wednesday 16th October 2019
Markets_main1571203567.png-28918

ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గుతుంది. ఆసియా మార్కెట్లో బుధవారం ఔన్స్‌ పసిడి ధర ఈ నెల(అక్టోబర్‌) కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తొలి దశ ఒప్పందానికి చైనా అంగీకరించడంతో ఆసియా మార్కెట్లు, బ్రెగ్జిట్‌ సంబంధిత ఒప్పందం ఈ వారంలోనే కుదరగలదన్న వార్తలతో యూరప్‌ మార్కెట్లు, కార్పొరేట్‌ దిగ్గజాలు క్యూ3(జులై-సెప్టెంబర్)లో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటనతో అమెరికా మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర 14.10 డాలర్లు (1.09శాతం) నష్టపోయి 1,483.50 డాలర్ల వద్ద స్థిరపడింది. నేడు కూడా ఆసియా మార్కెట్లో సానుకూల ధోరణి కనిపిస్తున్న నేపథ్యంలో పసిడి ధర అక్కడక్కడే ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల స్వల్ప లాభంతో 1,485 డాలర్ల వద్ద కదలాడుతుంది. 
దేశీయంగానూ అదే ట్రెండ్‌ :- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు తగ్గట్లుగానే దేశీయంగా పసిడి ధర ట్రేడ్‌ అవుతోంది. నిన్నటిరోజు రూపీ భారీగా బలహీనపడినప్పటికీ.., ప్రపంచమార్కెట్లో పసిడి ఈ నెల కనిష్టానికి పతనం కావడంతో రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.190లు నష్టపోయి రూ.38,036 వద్ద స్థిరపడింది. రూపాయి బలహీనత, మధ్య ప్రాచ్యదేశాల ఉద్రిక్తతల నేపథ్యంలో నేటి ఉదయం దేశీయంగా పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్ల లభించడంతో రూ.92లు లాభపడి రూ.38128.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. You may be interested

బీపీసీఎల్‌ షేరు వాటా విక్రయ ధర రూ. 510- 1110?

Wednesday 16th October 2019

నిపుణుల అంచనా ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తుందన్న వార్తల నడుమ గత నెల్లో బీపీసీఎల్‌ షేరు దాదాపు 28 శాతం ర్యాలీ జరిపింది. ఇందులో వాటాలను ఒకే కొనుగోలుదారుకు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సంస్థ విలువ మదింపు చేసేందుకు తాజాగా బిడ్డింగ్‌ ప్రక్రియను ఆరంభించింది. ఈ నేపథ్యంలో కంపెనీ విలువ, ఇతర వివరాలపై నిపుణుల అంచనాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం కంపెనీ ఎంటర్‌ప్రైజ్‌ వాల్యూ, వచ్చే సంవత్సరం కంపెనీ ఎబిటా

పాజిటివ్‌గా రియల్టీ..సన్‌టెక్‌ 4% అప్‌!

Wednesday 16th October 2019

 బ్యాంకులు రుణ మేళాల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలను అందిస్తుండడంతో పాటు, మరోదపా రేట్ల కోత ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఫలితంగా గత కొన్ని సెషన్‌ల నుంచి దేశీయ రియల్టీ షేర్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. వీటికి తోడు అంతర్జాతీయ పరిణామాలు కూడా సానుకూలంగా ఉండడంతో బుధవారం ఉదయం 10.39 సమయానికి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1.46 శాతం లాభపడి 257.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో సన్‌టెక్‌

Most from this category