News


ఈక్విటీల కంటే బంగారమే బెటర్‌: విశ్లేషకులు

Tuesday 7th January 2020
Markets_main1578380495.png-30730

ఈ ఏడాది కూడా పసిడిదే హవా అంటున్న విశ్లేషకులు 
పోర్ట్‌ఫోలియోలో పసిడికి 15శాతం కేటాయించమని సలహా

గతేడాది ఈక్విటీల కంటే అధిక రాబడులను పంచిన పసిడి.. ఈ ఏడాది కూడా ట్రెండ్‌ను కొనసాగించవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లపై మెతక ధోరణి తదితర అంశాలతో 2019 ఏడాదిలో కామెక్స్‌ (న్యూయార్క్‌) గోల్డ్‌ పసిడి 14శాతం ర్యాలీ చేయగా, దేశీయ ఎంసీఎక్స్‌ పసిడి ధర ఈక్విటీ సూచీలను మించి 24.5శాతం రాబడులనిచ్చింది. ఇదే సమయంలో నిఫ్టీ ఇండెక్స్‌ 12శాతం పెరిగింది.

పసిడి ర్యాలీ ఇంకా పూర్తి కాలేదు ఈ ఏడాదిలో రూ.4500 స్థాయిని అందుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త ఏడాదిలో ఇన్వెస్టర్లు తన పోర్ట్‌ఫోలియోలో పసిడిని 5నుంచి 15శాతం వరకు పెంచుకోవాలని వారు సలహానిస్తున్నారు. అంతర్జాతీయ వృద్ధి క్షీణత, కేంద్ర బ్యాంకులు ద్రవ్యపాలసీపై మెతకవైఖరి తదితర అంశాలు పసిడి ర్యాలీకి తోడ్పాటునిస్తాయని వారంటున్నారు.

బ్రెగ్జిట్‌, హాంగ్‌కాంగ్‌ లిబరేషన్‌ బిల్‌, ఉత్తర అమెరికా అణు ఒప్పందం, మధ్యప్రాచ్చ, తూర్పు ఆఫ్రికా దేశాల్లో మిలిటెన్సీ సమస్యలు, అమెరికా ఎన్నికలు తదితర అంశాలు ఈ ఏడాది అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉన్నందున అంతర్జాతీయంగా పసిడి పెట్టుబడులకు మరింత డిమాండ్ను పెంచవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో ఈ ఏడాదిలో కూడా సెం‍ట్రల్‌ బ్యాంకులు పెద్దఎత్తున పసిడిని కొనుగోలు చేయవచ్చు. అమెరికా చైనాల మధ్య ఇటీవల కుదిరిన మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాకపోవడంతో పాటు వచ్చే ఏడాదిలో కూడా పూర్తిస్థాయిలో సమస్యకు పరిష్కారమార్గం లభించకపోవచ్చనే అంచనాలతో పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్ల తగ్గింపునకే మొగ్గు చూపవచ్చు. వడ్డీరేట్ల కోత పసిడి ర్యాలీకి కలిసొచ్చే ప్రధాన అంశాల్లో ఒకటనే విషయాన్ని విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. 


అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు, రీసెర్చ్‌ సంస్థలు భారత వృద్ధి రేటు 4.8- 5శాతం తగ్గించాయి. ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు అవుట్‌లుక్‌ను 6శాతం నుంచి 5శాతానికి డౌన్‌గ్రేడ్‌ చేసింది. అమెరికా ఫెడ్‌, ఈసీబీ, బీఓజే, పీబీఓసీలు బ్యాంకులు ఆర్థిక వృద్ధి మందగమాన్ని పునరుత్తేజించేందుకు వడ్డీరేట్లపై సానుకూల ధోరణిని కలిగి ఉండటం పసిడికి ర్యాలీకి కలిసొచ్చే ప్రధాన అంశంగా ఉంది. ఈ ఏడాదిలో కూడా పసిడి సరాసరి 15శాతం లాభాల్ని ఇన్వెస్టర్లకు పంచే అవకాశం ఉంది. దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఈ ఏడాది 10గ్రాముల పసిడి రూ.45వేలకు తాకింది అని ఏవీపీ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సింగ్‌ తెలిపారు.

పసిడి ఇన్వెస్టర్లు ఏమి చేయాలి?

ఈ ఏడాదిలో పసిడి ర్యాలీ చేసేందుకు అవకాశం ఉందనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ‘‘పతనమైన ప్రతిసారి పసిడి కొనుగోలు’’ అనే వ్యూహాన్ని అమలు చేయడం ఉత్తమం. ఈక్విటీలు అసాధారణమైన ఆదాయాలు అందవచ్చు అయితే అనిశ్చితి పరిస్థితుల్లో ఫోర్ట్‌ఫోలియోను విలువను భారీగా తగ్గిస్తాయి. ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితుల్లో పసిడిని రక్షణాత్మక సాధనంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని గమనించాలి. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ ఫోలియోలో 15శాతం పసిడి పెట్టుబడులకు కేటాయించాలని అడ్వెజరీ ఎండీ డాట్‌కామ్‌ సీఈవో మహేక్ తోమర్‌ అభిప్రాయపడ్డారు.

ఫైనాన్షియల్‌ మార్కెట్ల పతనం, రిస్క్‌ అసెట్స్‌లో బలహీనత, యుద్ధ వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం తదితర కారణాలను దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో పసిడిని 15-20శాతానికి పెంచుకోవాలి. పసిడి ధర పెరుగుదల పతనమైన పోర్ట్‌ఫోలియో విలువను భర్తీ చేస్తుంది. అలాగే పసిడి కొనుగోలు సమర్థవంతమైన బీమా అని బీఎన్‌బీ పారిబాస్ తన నివేదికలో పేర్కోంది. You may be interested

ఎస్‌బీఐ మినహా ఇతర పీఎస్‌బీలకు దూరం

Tuesday 7th January 2020

చౌకగా లభిస్తున్నాయని చిన్న బ్యాంక్స్‌ కొనొద్దు పెట్టుబడులకు ప్రయివేట్‌ రంగ బ్యాంక్స్‌ మేలు హేమంగ్‌ జానీ, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌, షేర్‌ఖాన్‌  చిన్న బ్యాంకులు లేదా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ కౌంటర్లలో కొనుగోళ్లు చేపట్టడం అంత లాభించకపోవచ్చంటున్నారు మార్కెట్‌ నిపుణులు హేమంగ్‌ జానీ. రీసెర్చ్‌ సంస్థ షేర్‌ఖాన్‌కు సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అయిన జానీ.. పీఎస్‌యూ బ్యాంకింగ్‌ విభాగంలో స్టేట్‌బ్యాంక్‌ మెరుగైన కౌంటర్‌గా పేర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రయివేట్‌ రంగంలో పెద్ద బ్యాంకులవైపు దృష్టి సారించవచ్చునంటున్నారు. ఒక ఆంగ్ల

హైడివిడెండ్‌ స్టాక్స్‌పై కన్నేయండి!

Tuesday 7th January 2020

జీసెక్‌ ఈల్డ్స్‌ కన్నా బెటర్‌ నిపుణుల సూచన ప్రభుత్వ సెక్యూరిటీలపై ఈల్డ్స్‌ తగ్గిపోతున్న నేపథ్యంలో అధిక డివిడెండ్‌ ఈల్డ్స్‌ ఉన్న షేర్లపై పెట్టుబడులు పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 2018లో పదేళ్ల జీసెక్‌ ఈల్డ్‌ 8 శాతం ఉండగా, ప్రస్తుతమిది 6.5 శాతానికి చేరింది. దీంతో పలువురు ఇన్వెస్టర్లు హైడివిడెండ్‌ ఈల్డ్‌ స్టాక్స్‌వైపు మరలుతున్నారు. ఇలా అధిక డివిడెండ్‌ ఇస్తున్న కొన్ని టాప్‌ షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి... 1. ఎస్‌జేవీఎన్‌: షేరు 2018-19

Most from this category