News


పసిడి మెరుపులు తగ్గుతాయా??

Monday 11th November 2019
Markets_main1573464744.png-29506

ట్రేడ్‌వార్‌ ముగింపుతో బంగారం ధర తగ్గే ఛాన్సులు
స్వల్పకాలికమేనని నిపుణుల అంచనా
గతవారం యూఎస్‌, చైనా వాణిజ్య చర్చలపై పాజిటివ్‌ వార్తలు వచ్చిన నేపథ్యంలో దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధర కాస్త వెనకడుగువేసింది. దేశీయ ఎంసీఎక్స్‌ బంగారం గతవారాన్ని 1.6 శాతం నష్టంతో ముగించింది. రెండు పెద్ద దేశాల మధ్య చర్చలు ఫలప్రదమయ్యే అవకాశాలు కనిపించడంతో స్టాక్‌ మార్కెట్లు కదం తొక్కాయి. వాణిజ్యయుద్ధం శాంతియుతంగా ముగిస్తే ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను పునఃసమీక్షిస్తామని అంతర్జాతీయ ద్రవ్యనిధి పేర్కొంది. మరోవైపు యూఎస్‌లో ఉత్పత్తి గణాంకాలు మెరుగ్గా వచ్చాయి. డాలర్‌ బలపడింది. ఇవన్నీ కలిసి పసిడి ధరపై ఒత్తిడి పెంచాయి. దీంతో బంగారం మిలమిలలు కొంచెం తగ్గాయి. పైగా మూడో త్రైమాసికంలో బంగారం ఆభరణాలు, కడ్డీలు, నాణేలకు డిమాండ్‌ బాగా తగ్గిందని ప్రపంచ పసిడి సమాఖ్య వెల్లడించడం ధరపై ప్రభావం చూపింది. మూడో త్రైమాసికంలో బంగారం ఆభరణాలకు డిమాండ్‌ 16 శాతం పడిపోయి తొమ్మిదేళ్ల కనిష్టానికి చేరింది. మరోపక్క భారత బంగారం దిగుమతులు అక్టోబర్‌లో గతేడదితో పోలిస్తే భారీగా తగ్గాయి. దిగుమతులు తగ్గడం వరుసగా ఇది నాలుగో నెల కావడం విశేషం. అక్టోబర్‌లో భారత్‌ 38 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంది. 
ట్రేడ్‌వార్‌ ముగిసిపోవడం, వృద్ది అంచనాలు పెరగడం తదితర కారణాలతో ఇన్వెస్టర్లు క్రమంగా రిస్కీ అసెట్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ట్రేడ్‌వార్‌పై శాంతి పవనాలు ఇన్వెస్టర్లను ఈక్విటీలవైపు మరలుస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్లే బంగారం ధర తగ్గుముఖం పట్టిందంటున్నారు. అయితే ఈ తరుగుదల స్వల్పకాలికమే కావచ్చని, ట్రంప్‌ తాజా వ్యాఖ్యలతో ట్రేడ్‌వార్ భయాలపై సందిగ్ధత పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో యూకే, జర్మనీ, యూరోజోన్‌ క్యు3 జీడీపీ గణాంకాలు, యూఎస్‌ ఐఐపీ, రిటైల్‌ విక్రయాలు, ఫెడ్‌ వ్యాఖ్యానాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. You may be interested

బ్యాంక్‌ షేర్ల ర్యాలీతో పాజిటివ్‌ ముగింపు

Monday 11th November 2019

ట్రేడింగ్‌ ఆద్యంత లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరికి స్వల్పలాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 21.47 పాయింట్లు పెరిగి 40,345.08 వద్ద, నిఫ్టీ 5పాయింట్ల లాభంతో 11,913 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 389 పాయింట్లు లాభపడి 4నెలల గరిష్టం 31,139 వద్ద ముగిసింది. ఆర్థిక, మీడియా, రియల్టీ రంగ షేర్లకు కూడా లాభపడ్డాయి. మరోవైపు

మిడ్‌క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడులకు ఇది సమయమేనా...?

Monday 11th November 2019

గత రెండేళ్లలో ఇన్వెస్టర్లకు అంతంత మాత్రంగా ఆదాయాల్ని సమకూర్చిన మిడ్‌క్యాప్‌ ఫండ్లల్లో ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చని ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాదారులు సిఫార్సు చేస్తున్నారు. 2018 జనవరి నాటి నుంచి షేరు ధరల్లో భారీ పతనాన్ని చవిచూసిన తరుణంలో వ్యాల్యుయేషన్స్‌ ‍కనిష్టస్థాయిని తాకాయి. అయితే మందగమనం కారణంగా మార్కెట్‌ పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ అవుతున్నందున మూడేళ్ల కాల పరిమితితో మిడ్‌క్యాప్‌ పథకం యూనిట్లను కొనుగోలు చేయవచ్చని అనలిస్టులు సలహానిస్తున్నారు. ఫ్రాంక్టిన్‌ ఇండియా ప్రిమ ఫండ్‌, కోటక్‌

Most from this category