News


కొత్త సంవత్‌లో గోల్డ్‌ రన్‌..

Saturday 26th October 2019
Markets_main1572062826.png-29149

- రూ. 41,500కు చేరే అవకాశాలు

అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, భౌగోళిక.. రాజకీయ ఆందోళనలు, బ్రెగ్జిట్‌పై తొలగని అనిశ్చితి... ఇవన్నీ 2019లో పసిడికి లాభించాయి. ఐఎంఎఫ్, వరల్డ్‌ బ్యాంక్‌ లాంటి సంస్థలు ప్రపంచ దేశాల వృద్ధి రేటు అంచనాలను కుదిస్తుండటంతో .. వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు బంగారం నిల్వలు మరింత పెంచుకున్నాయి. దేశీయంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం పుత్తడికి కలిసొచ్చింది. మొత్తం మీద గత దీపావళి నుంచి చూస్తే ఈక్విటీలపై 10 శాతం మేర రాబడులు రాగా.. పసిడి 21 శాతం దాకా లాభాన్నిచ్చింది. అయితే, ధరతో పాటు దిగుమతి సుంకాలూ పెరిగిపోవటం పసిడికి కొంత ప్రతికూలమే. 2019లో దిగుమతులు 12 శాతం తగ్గగా.. పండుగ సీజన్లో కూడా డిమాండ్‌ ఒక మోస్తరుగానే ఉంది.
వాణిజ్య యుద్ధభయాలు తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. వేగం తగ్గినా.. పసిడి పరుగు కొనసాగుతుందనే అంచనాలున్నాయి. ప్రధాన ఎకానమీల్లో మందగమనం మరి కొన్నాళ్లు కొనసాగే అవకాశాలు, సెంట్రల్‌ బ్యాంకులు ఉదార విధానాలు కొనసాగించనుండటం పసిడి ధరకు మద్దతుగా నిలవవచ్చు. ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధ భయాలు తగ్గిపోతే పసిడి కొంత కరెక్షన్‌కు లోనైనా.. రూ.35,500 మద్దతును నిలబెట్టుకోగలిగితే మళ్లీ గత గరిష్ట స్థాయి రూ.39,500ను తాకవచ్చు.. ఆ పైన వచ్చే 12 నెలల్లో రూ. 41,500కి కూడా చేరవచ్చు. 



You may be interested

నిఫ్టీ వీక్లీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌

Saturday 26th October 2019

స్వల్పరేంజ్‌లో కదలికలు సంవత్‌ 20175ను సూచీలు పేలవంగా ముగించాయి. నిఫ్టీ శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులు చూసి చివరకు ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ కీలకమైన 11600 పాయింట్ల దిగువన ముగియడంతో పాటు వీక్లీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పడింది. వారం మొత్తానికి నిఫ్టీ 0.7 శాతం నష్టపోయింది. ప్రస్తుతం నిఫ్టీ రేంజ్‌ బౌండ్‌లో ఉందని, దీన్ని దాటితేనే తదుపరి కదలికలుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 11500- 11700 పాయింట్ల మధ్యనే నిఫ్టీ ఐదు రోజులుగా

కొత్త సంవత్‌లో బ్రోకరేజిల నిఫ్టీ, సెన్సెక్స్‌ అంచనాలు!

Saturday 26th October 2019

- ఆశావహంగా కొత్త సంవత్‌.. - వడ్డీ రేట్ల కోత, ఉద్దీపనలు కీలకం  - మరిన్ని సంస్కరణలకు అవకాశాలు - ట్యాక్స్‌ రేటు తగ్గింపుతో కార్పొరేట్లకు ఊతం - నిఫ్టీ టార్గెట్‌ 14,000, సెన్సెక్స్‌ 46,000 - బ్రోకరేజీల అంచనాలు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌తో మొదలైన సంక్షోభం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలను కుదిపేస్తోంది. అంతర్జాతీయంగానేమో మందగమనం, వాణిజ్య యుద్ధ భయాలు రాజ్యమేలుతున్నాయి. అందుకే... మదుపరులకు సంవత్‌ 2075 పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. జీడీపీ అంచనాల తగ్గింపు, కంపెనీల ఆదాయాల

Most from this category