1500డాలర్ల పైన ముగిసిన పసిడి ఫ్యూచర్స్
By Sakshi

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ ధర ఈ వారాంతపు రోజైన శుక్రవారం 1500 డాలర్ల పైన ముగిసింది. అమెరికా మార్కెట్లో నిన్న రాత్రి ఔన్స్ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,508.50 వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తంగా 3.5శాతం ర్యాలీ చేసిన పసిడి ఫ్యూచర్లు బుధవారం రోజున 1,522.35 వద్ద ఆరేళ్ల గరిష్టస్థాయిని అందుకుంది. వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా డాలర్ మారకంలో తన దేశపు కరెన్సీ యువాన్‌ను విలువను తగ్గించుకుంది. దీంతో పలుదేశ సెంట్రల్ బ్యాంకులు రక్షణాత్మక మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో పసిడికి డిమాండ్ పెరగవచ్చనే అంచనాలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్ పెంచడంతో నిన్నరాత్రి 1,519.65 డాలర్ల వద్ద గరిష్టాన్ని అందుకుంది. అయితే చివర్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో 1,508.50 వద్ద స్థిరపడింది. వాణిజ్య యుద్ధం కారణంగా ఫెడ్రిజర్వ్తో పాటు మిగిలిన సెంట్రల్ బ్యాంకు వడ్డీరేట్లకు మొగ్గుచూపవచ్చనే అంచనాలు 1500డాలర్ల పైన ముగింపునకు దోహదపడ్డాయి. అమెరికాతో పాటు యూఎస్ డాటాతో పాటు, చైనా, జర్మనీ, యూరోజోన్ దేశాలు వెలువరించే ఆర్థిక గణాంకాల కోసం పసిడి ట్రేడర్లు ఎదురుస్తున్నట్లు ఫారెక్స్ విశ్లేషకుడు ఫవాద్ రజాక్జాడా అభిప్రాయపడ్డారు. గణాంకాలు ఆశించినస్థాయిలో నమోదైనట్లైయితే పసిడి ధర కొంత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశీయంగా రూ.235ల లాభం:-
ఇక దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర శుక్రవారం రూ.235 లాభపడ్డాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు క్షీణించడటం పసిడి ర్యాలీకి కలిసొచ్చింది. ఫలితంగా శుక్రవారం అక్టోబర్ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.38000 దిగువను రూ.37992.00 వద్ద స్థిరపడింది. ఈ వారంలో జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన పసిడి ధర ఈ వారంలో మొత్తం రూ.1621లు లాభపడింది.
You may be interested
11100ల దిగువుకు ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఇండెక్స్
Saturday 10th August 2019విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఇండెక్స్ శుక్రవారం 11100ల దిగువన ముగిసింది. సింగపూర్‌లో ట్రేడింగ్ ముగిసే సరికి 11,089.50 వద్ద స్థిరపడింది. ఇది(11,089.50) నిఫ్టీ ఫ్యూచర్ ముగింపు(11123)తో పోలిస్తే 33.50పాయింట్లు తక్కువ. జాతీయ, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ ఇండెక్స్ సోమవారం నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.అమెరికా చైనాల దేశాల మధ్య సెప్టెంబర్‌లో జరగాల్సిన వాణిజ్య పరిష్కార చర్చలు రద్దు అయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు
ప్రాంతీయ భాషల్లో వెబ్సైట్లు, యాప్స్
Saturday 10th August 2019ప్రయాణికులను ఆకర్షించేందుకు ఇండిగో వ్యూహం కోల్‌కతా: చిన్న పట్టణాల్లోని ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ప్రాంతీయ భాషల్లో వెబ్‌సైట్స్, యాప్స్‌ను ప్రవేశపెట్టడంపై ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ ఇండిగో కసరత్తు చేస్తోంది. హిందీ, బెంగాలీతో పాటు ఎనిమిది భారతీయ భాషల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు డిజిటల్ సక్సెస్ సదస్సు - 2019లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (డిజిటల్) నితిన్ సేఠి చెప్పారు."మాకు డిజిటల్ మాధ్యమం చాలా ముఖ్యం. మరింత మంది