News


ఏడాది చివరకు 42,000కు పసిడి!

Tuesday 29th October 2019
Markets_main1572319000.png-29188

  • విశ్లేషకుల అంచనా
  • రాజకీయ అనిశ్చితి, 
  • బలహీన రూపాయి కారణాలు
  • ఆర్‌బీఐ కొనుగోళ్లూ కలిసివచ్చే అంశమే!

ముంబై: పసిడి 10 గ్రాముల ధర ఈ సంవత్సరాంతానికి దేశంలో రూ.42,000ను తాకుతుందని ‍కమోడిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనత, విదేశీ మారకద్రవ్య నిల్వల స్థిరత్వానికి వీలుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పసిడి కొనుగోళ్లు వంటి అంశాలు దేశంలో పసిడి ధర పరుగుకు దోహదపడతాయని వారి విశ్లేషణ.

అంతర్జాతీయంగా 1,650 డాలర్లకు..!
‘‘మధ్య ప్రాశ్చ్యంలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దీనితో ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ కమోడిటీ మార్కెట్‌ నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర 1,650 డాలర్లకు చేరవచ్చు. ఇక దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌(ఎంసీఎక్స్‌)లో ఈ ధర 10 గ్రాములకు ఏకంగా రూ.42,000కి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని కాంట్రెంజ్‌ రిసెర్చ్‌ సహ వ్యవస్థాపకులు, సీఈఓ జ్ఞాన్‌శేఖర్‌ త్యాగరాజన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి వరకూ పసిడి ధర పెరుగుదల ధోరణినే కనబరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈక్విటీల్లో సంవత్సరాంత డిరివేటివ్‌ పొజిషన్ల స్క్వేరాఫ్‌ అవకాశాలు కూడా పసిడి ధర పెరుగుదలకు దోహదపడుతుందని ఆయన విశ్లేషించారు. పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్‌ పసిడిని చూస్తాడనడానికి పలు కారణాలు కనబడుతున్నాయని  అన్నారు. ఎంసీఎక్స్‌లో  పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం ట్రేడింగ్‌ చివరకు రూ.38,293 వద్ద ముగిసింది. ఇక నైమెక్స్‌లో ఔన్స్‌ ధర సోమవారం ఈ వార్తరాసే రాత్రి 8 గంటల సమయానికి 1,492 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సోమవారం దేశీయ మార్కెట్లకు సెలవు. 

రిటర్న్‌ బాగుంది...
మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఎంఓఎఫ్‌ఎస్‌ఎల్‌) వైస్‌ప్రెసిడెంట్‌ (కమెడిటీ రిసెర్చ్‌) నవ్‌నీత్‌ దమనీ మాట్లాడుతూ, పసిడి రిటర్న్‌ విషయంలో ఈ సంవత్సరం అత్యుత్తమ సంవత్సరంగా నిలిచిందన్నారు. దేశీయంగా పసిడి ధర 15 శాతం పెరిగిందని పేర్కొన్నారు. డాలర్‌ మారకంలో రూపాయి 1.4 శాతం బలహీనపడ్డం దీనికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఇదే పరిస్థితి మున్ముందూ కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక మందగమన పరిస్థితుల ప్రభావం పసిడికి సానుకూలం అయ్యే వీలుందని పేర్కొన్నారు.  You may be interested

స్టాండర్డ్‌ గ్లాస్‌ కొత్త ప్లాంటు

Tuesday 29th October 2019

జిన్నారం వద్ద రూ.35 కోట్లతో ఏర్పాటు ఈ ఏడాది రూ.140 కోట్ల టర్నోవర్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఔషధ, రసాయనాల ఉత్పత్తికి అవసరమైన కీలక పరికరాల తయారీలో ఉన్న స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ మరో ప్లాంటును నెలకొల్పుతోంది. హైదరాబాద్‌ సమీపంలోని జిన్నారం వద్ద రూ.35 కోట్లతో దీనిని స్థాపిస్తోంది. ఏప్రిల్‌లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని స్టాండర్డ్‌ గ్రూప్‌ ఎండీ కందుల నాగేశ్వర రావు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. నెలకు 200ల

39,440 పైన ముగిస్తే ర్యాలీ

Tuesday 29th October 2019

అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌డీల్‌ కుదిరే అవకాశాలు మెరుగుపడటంతో అంతర్జాతీయ మార్కెట్లు గతవారం స్థిరంగా ట్రేడయినప్పటికీ, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీరాకపోవడంతో దేశీయ స్టాక్‌ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే ఈ వారం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం, బ్రెగ్జిట్‌ సందిగ్దత వంటి అంశాలున్నప్పటికీ, చాలా నెలల తర్వాత అటు విదేశీ ఇన్వెస్టర్లు, ఇటు దేశీయ ఫండ్స్‌ కలిసి గత కొద్దిరోజులుగా కొనుగోళ్లు జరుపుతున్న కారణంగా

Most from this category