News


పండుగ సీజన్‌పై పసిడి ఆశలు

Saturday 21st September 2019
Markets_main1569061343.png-28473

దేశీయ బులియన్‌ మార్కెట్‌ పండుగ సీజన్‌పై పసిడి ఆశలు పెట్టుకుంది. సాధారణంగా భారత్‌లో సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యకాలంలో  దసరా, దీపావళి లాంటి సంప్రదాయ పండుగుల సీజన్‌తో పాటు పెళ్ళిళ్ల కారణంగా ఈ సీజన్‌లో పసిడికి భారీ డిమాండ్‌ నెలకొంటుంది. డిమాండ్ సీజన్లోకి ప్రవేశించినప్పుడు పసిడికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నవంబర్‌ చివరి నాటికి పసిడి ఫ్యూచర్‌ 10గ్రాముల పసిడి ధర రూ.41,800 చేరుకునే అవకాశం ఉందని బులియన్‌ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అయితే ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి రికవరీ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

ప్రపంచమార్కెట్లో పసిడి ధర ఆరేళ్ల గరిష్టాన్ని అందుకున్న తర్వాత కొద్దిగా దిద్దుబాటుకు లోనైంది. అంతర్జాతీయ వృద్ధి ఆందోళనల నేపథ్యంలో పలు దేశాల కేంద్ర రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీరేట్లపై మెతక వైఖరిని ప్రదర్శించడటం, అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, ఆయా దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి కీలకమైన 1500 డాలర్ల స్థాయిని నిలుపుకోగలింది. ఈ ఏడాది జాతీయ, అంతర్జాతీయంగా పసిడి ధర 25శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఈ తరుణంలో ఇటీవల ఆయా దేశాల కేంద్రబ్యాంకులు వడ్డీరేట్లపై తీసుకన్న వాస్తవిక విధాన చర్యలు, అగ్రరాజ్యాలు వాణిజ్య యుద్ధ పరిష్కారం దిశగా అడుగులు వేస్తుండటం, గరిష్టస్థాయిల వద్ద లాభస్వీకరణ చోటుచేసుకోవడం తదితర కారణాలతో పసిడి ధర దిద్దుబాటుకు గురైంది. ఇటీవల జరిగిన అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ భవిష్యత్తులో వడ్డీరేట్ల అవుట్‌లుక్‌పై ఎలాంటి స్పష్టమైన సంకేతాలన్విలేదు. దీంతో ఇన్వెస్టర్లు పసిడి కొనుగోళ్లకు మక్కువ చూపడం లేదు. మార్కెట్‌ అంచనాలకు తగ్గట్టు ఫెడ్‌ వడ్డీరేట్లపై పావు శాతం కోత విధించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ సానుకూలంగానే ఉందని, రానున్న రోజుల్లో వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చనే సంకేతాల్ని ఫెడ్‌ ఇచ్చింది.
అయితే ఇటీవల మధ్యప్రాచ్య దేశ భౌగోళిక ఉద్రికత్తలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై తిరుగుబాటుదారులు చేసిన దాడికి ఇరాన్‌ సాయం చేసినందుకు ప్రతీకారంగా ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు అమెరికా, చైనాల మధ్య వాణిజ్య చర్చలు సందిగ్ధత స్థితిలో పడ్డాయి. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చలో భాగంగా మోంటానాలోని పొలాలను సందర్శించే ప్రణాళికలను చైనా ప్రతినిధి బృందం రద్దు చేసుకుని షెడ్యూల్‌ కంటే ముందుగానే చైనాకు తిరిగి ప్రయాణమైనట్లు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి.  మరోవైపు ఇటీవల ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపుతో డాలర్‌పై దాని ప్రభావాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రతికూల పరిణామాలు కనిష్టస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతున్న పసిడి ధరకు డిమాండ్‌ను పెంచుతున్నాయి.  పసిడి ధర 1,462డాలర్ల పైన ఉన్నంత వరకు పసిడి ర్యాలీ కొనసాగవచ్చని,  ఒక వేళ పసిడి 1,420 డాలర్లకు పతనమైతే... 1,365డాలర్ల స్థాయికి క్షీణించే అవకాశం వుందంటూ బులియస్‌ సాంకేతిక విశ్లేషకులు అంటున్నారు. 

ఇక దేశీయంగా బులియన్‌ మార్కెట్‌ విషయానికొస్తే... అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు బలహీనంగా ఉండటానికి తోడు డిమాండ్‌ మితంగా ఉండటం, డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనం తదితర కారణాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. పసిడి ధరలు రికార్డుస్థాయిలో ట్రేడ్‌ అవుతున్న తరుణంలో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపకపోవడంతో దేశీయంగా పసిడికి డిమాండ్‌ తగ్గింది. You may be interested

పన్ను తగ్గింపుతో తక్షణ వృద్ధిని ఆశించలేం : మూడీస్‌

Saturday 21st September 2019

కేంద్ర ప్రభుత్వం దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గిం‍చడం, దేశ ద్రవ్యలోటు ఒత్తిళ్లు పెరగడానికి కారణమవుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ శనివారం తెలిపింది.  ప్రభుత్వం దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. తగ్గిన ట్యాక్స్‌ వలన దేశంలో పెట్టుబడులు పెరిగి, పన్నుల సేకరణ వృద్ధి చెందుతుందని, ఫలితంగా ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం భర్తీ అవుతుందని తాము

ట్యాక్స్‌ తగ్గింపుతో లాభపడే రంగాలివే!

Saturday 21st September 2019

కేంద్ర ప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి(సెస్‌, సర్‌చార్జీలను మినహాయించి) తగ్గించింది. కాగా ఈ చర్య వలన దేశీయ కంపెనీల లాభాల్లో 11 శాతం వృద్ధి వుంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఉద్దీపనం వలన స్వల్ప, మధ్య కాలానికి గాను ఇండియా ఈక్విటీ మార్కెట్లు ఆకర్షిణీయంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి ఇండియాలో వివిధ రకాల ట్యాక్స్‌ ప్రొవిజన్స్‌ ఉండడం వలన ట్యాక్స్‌

Most from this category