News


మళ్లీ మొదలైన పసిడి పరుగులు

Saturday 24th August 2019
Markets_main1566632310.png-27991

అగ్రరాజ్యాల మధ్య వాణిజ్యయుద్ధ ఉద్రికత్తలు  రాజుకోవడంతో ప్రపంచమార్కెట్లో పసిడి పరుగులు మళ్లీ మొదలయ్యాయి. అమెరికాలో శుక్రవారం​రాత్రి  29డాలర్లు లాభపడి 1,537.60డాలర్ల వద్ద స్థిరపడింది. గడిచిన 3వారాల్లో పసిడి ఒకరోజులో ఇంతస్థాయిలో ర్యాలీ చేయడం ఇదే తొలిసారి. ఈ వారం మొత్తంగా పసిడి ధర 13డాలర్లు పెరిగింది.

అమెరికాకు చెందిన 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10శాతం సుంకాలను విధిస్తున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. సెప్టెంబర్‌ 1 నుంచి కొన్ని ఉత్పత్తులపై డిసెంబర్‌ 15 నుంచి మరికొన్ని ఉత్పత్తులపై పెరిగిన సుంకాల శాతం అమల్లోకి వస్తాయని చైనా తెలిపింది. అమెరికా వస్తువులపై టారిఫ్‌లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన వెంటనే ట్రంప్‌ చైనాకు చెందిన దాదాపు 550 బిలియన్‌ డాలర్లు విలువైన ఉత్పత్తులపై 5శాతం టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ టారిఫ్‌లు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.
మరోవైపు ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ శుక్రవారం జరిగిన జాక్సన్‌ హోల్‌ ఆర్థిక సదస్సులో వడ్డీరేట్లపై పావెల్‌ స్పందించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు అవసరమైతే వడ్డీరేట్లను మరింత తగ్గించడానికి ఫెడ్‌ రిజర్వ్‌ సిద్ధంగా ఉందని పావెల్‌ తెలిపారు. అయితే రేట్ల తగ్గింపు ఎప్పుడు, ఎంత ఉంటుంది అనే అంశంపై స్పష్టతనివ్వలేదు.
అగ్రరాజ్యాల మధ్య మరోసారి రాజుకున్న వాణిజ్యయుద్ధంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో మరోసారి బలహీన సంకేతాలు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి అమెరికా సూచీలు దాదాపు 3శాతం క్షీణించగా, ఆసియా ఫ్యూచర్లు భారీగా నష్టపోయాయి. సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక పెట్టుబడులుగా భావించే పసిడి ధరకు ఈ ప్రతికూలాంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో 32 డాలర్లదాకా లాభపడి 1,540 వద్ద గరిష్టాన్ని తాకాయి. చివరకు 29డాలర్ల లాభంతో 1,537.60డాలర్ల వద్ద స్థిరపడింది. 
దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లోనూ రూ.600లు ర్యాలీ:- 
రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి భారీగా పెరగడంతో దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లోనూ గత రాత్రి ట్రేడింగ్‌లో పసిడి ధర భారీగా లాభపడింది. నిన్న ఒక్కరోజు మాత్రమే రూ.600లు(1.57శాతం) లాభపడి రూ.38765.00 వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తం మీద పసిడి ధర రూ.827 లాభపడింది. 



You may be interested

మార్కెట్‌ ట్రెండ్‌ రివర్స్‌ అవుతుంది

Saturday 24th August 2019

-విశ్లేషకుల అంచనా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రకటించిన ఆర్థిక చర్యలపై మార్కెట్‌ వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి. ఇది దేశ ఆర్థిక మందగమనాన్ని నిలువరించగలదని అభిప్రాయపడ్డాయి. ఈ ఉద్దీపన చర్యల కారణాన సోమవారం మార్కెట్‌ పెద్ద గ్యాప్‌ అప్‌తో ప్రారంభమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎఫ్‌పీఐ, డీఐఐలపై అదనపు సర్‌చార్జీని ఉపసంహరించడం, తక్షణమే ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చడం వంటి ప్రతిపాదనలను శుక్రవారం ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.

కన్నుమూసిన అరుణ్‌ జైట్లీ

Saturday 24th August 2019

మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆనారోగ్యం కారణంగా శనివారం మధ్యాహ్నాం కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని శుక్రవారం డిల్లీ ఎయిమ్స్‌కు మార్చారు. కిడ్ని సమస్యతో భాదపడుతున్న జైట్లీకి, ఈ ఏడాది మే 14 న రెంటల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ జరిగిన విషయం తెలిసిందే.

Most from this category