News


బంగారానికి ఫెడ్‌ బూస్టింగ్‌..!

Tuesday 24th March 2020
Markets_main1585034352.png-32651

రెండురోజుల్లో 118 డాలర్ల లాభం
దేశీయంగా రూ.1721లు లాభం

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పరుగులు పెడుతోంది.  కరోనా వైరస్‌ వ్యాధితో ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ తిరిగి స్థిరపడేంతవరకు ఎంతంటి చర్యలకైన వెనకాడబోమని అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ హామి ఇవ్వడంతో బంగారం ధర కనిష్ట స్థాయి నుంచి భారీగా రికవరీ అయ్యింది. గడచిన రెండు రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 118 డాలర్లు, దేశీయంగా రూ.1721లు లాభపడింది. 

ఫెడ్‌ రిజర్వ్‌ సోమవారం ఆర్థిక వ్యవస్థకు చేయూతనందిచే పలు అసాధారణమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా అమెరికా ప్రభుత్వ హామితో విద్యార్థులకు రుణాలు, అర్హత కలిగిన అందరికి క్రెడిట్ కార్డ్ రుణాలు, చిన్న వ్యాపారాలకు రుణాలు ఇస్తామని తెలిపింది. అమెరికా ఆర్థిక రెస్క్యూ ప్యాకేజీ బిట్లు సెనేట్‌లో నిలిచిపోయినప్పటికీ... ట్రెజరీ బాండ్లను, తనఖా-ఆధారిత సెక్యూరిటీలను అపరిమితంగా కొనుగోలు చేసి వ్యవస్థలో ద్రవ్యత్వానికి ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అలాగే  క్రెడిట్ ప్రవాహాన్ని నిర్ధారించడానికి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని ఫెడ్‌ తెలిపింది. 

ఫెడ్‌ ప్రకటనతో నిన్నరాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 3శాతం నష్టాన్ని చవిచూసినప్పటికి... బంగారం ధర మాత్రం ఏకంగా 83డాలర్లు(5.6శాతం) లాభపడి 1,567డాలర్ల వద్ద స్థిరపడింది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో కూడా అదే ట్రెండ్‌ను కొనసాగించడంతో మునుపటి ముగింపు(1,567)తో పోలిస్తే 35డాలర్లు పెరిగి 1604 డాలర్లకు చేరుకుంది. అంటే అంతర్జాతీయంగా బంగారం ధర కేవలం రెండు రోజుల్లో 118 డాలర్లు లాభపడిందన్న మాట.

ఫెడ్ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే చర్యలను ఆవిష్కరించడం బంగారానికి కలిసొచ్చింది. సెనెట్‌ ఆర్థిక బిల్లు నిలిచిపోవడం తాత్కలిక ఎదురుదెబ్బే కావచ్చు. ఈ వారం చివరలో భారీ ద్రవ్య ఉ‍ద్దీపన చర్యల ప్రకటన ఉండొచ్చని బంగారం వ్యాపారులు విశ్వసిస్తున్నారు. మార్కెట్ అస్థిరత కొంతవరకు సద్దుమణిగితే, బంగారం రక్షణాత్మక సాధనంగా తన స్థానాన్ని తిరిగి పొందుతుంది’’ అని బులియన్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు. 

దేశీయంగా రూ.1721 లాభం:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో బంగారం ధర బలపడింది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల బంగారం మునుపటి ముగింపు(రూ.41163)తో పోలిస్తే రూ.1021లు లాభపడి రూ.41163 స్థాయిని అందుకుంది. అయితే ఇదే రోజు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 22పైసలు బలపడటంతో పాటు స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బంగారం ధర నష్టాల్లోకి మళ్లింది. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి రూ.700లు లాభపడి రూ.41163 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఈ రెండురోజుల్లో ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ.1721లు లాభపడినట్టైంది. You may be interested

ఐఆర్‌సీటీసీ రివర్స్‌ పరుగు

Tuesday 24th March 2020

7వ సెషన్లోనూ డౌన్‌ సర్క్యూట్‌ 7 రోజుల్లో 30 శాతం పతనం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా దేశీయంగానూ రైల్వే సర్వీసులు బంద్‌కావడంతో పీఎస్‌యూ ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌ కౌంటర్‌కు షాక్‌ తగులుతోంది. కొద్ది రోజులుగా అమ్మకాల ఒత్తిడితో పతన బాటలో సాగుతున్న ఈ కౌంటర్‌ మరోసారి కుదేలైంది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. అంతా అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరవుకావడంతో ఎన్‌ఎస్‌ఈలో రూ. 45 క్షీణించి

8000 పైన ప్రారంభమైన నిఫ్టీ

Tuesday 24th March 2020

1259.69 లాభంతో మొదలైన సెన్సెక్స్‌ నిన్నటి ట్రేడింగ్‌లో అతిపెద్ద పతనాన్ని చవిచూసిన దేశీ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం భారీ గ్యాప్‌తో మొదలైంది. సెన్సెక్స్‌ 1259.69 లాభంతో 27240.93 వద్ద, నిఫ్టీ 400.75 పాయింట్లు పెరిగి 8002.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న భారీ పతనం నేపథ్యంలో ట్రేడర్ల షార్ట్‌కవరింగ్‌, నేడు ఆసియాలోని ప్రధాన మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ అవుతుండటం, డాలర్‌ మారకంలో రూపాయి నిన్నటి ముగింపు( 76.29)తో పోలిస్తే 22పైసల లాభంతో

Most from this category