స్వల్ప నష్టంతో ముగిసిన పసిడి
By Sakshi

పసిడి ఫ్యూచర్లలో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా ఔన్స్ పసిడి ధర గురువారం ముగింపు (1,429)తో పోలిస్తే 1.50డాలర్ల స్వల్ప నష్టంతో 1,428.85 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోత విధింపు అంచనాలు మరింత బలపడటంతో పాటు, పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు తెరపైకి రావడంతో ఆసియా ట్రేడింగ్లో 26 డాలర్ల మేర లాభపడి 1,454.35 వద్ద ఆరేళ్ల గరిష్టాన్ని అందుకుంది. పసిడి ధర ఆరేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అలాగే ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై పావుశాతం కోత విధింపు మాత్రమే ఉంటుందని వార్తలు వెలువడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ అరశాతం ర్యాలీ చేసి తిరిగి 97స్థాయిని అందుకుంది. ఫలితంగా పసిడి ఫ్యూచర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక వారం పరంగా చూస్తే పసిడి ధరకిది వరుసగా రెండోవారం లాభాల ముగింపు. ఈ వారంలో పసిడి మొత్తంగా 0.60శాతం లాభపడింది. ఇదేవారంలో ఆరేళ్ల గరిష్టస్థాయి 1,454.35 డాలర్లను అందుకుంది.
దేశీయంగా రూ.30500లపై ముగింపు:-
పసిడి ఆగస్ట్ ఫ్యూచర్ కాంట్రాక్టు ధర శుక్రవారం రూ.120.00లు నష్టపోయి రూ.35036 వద్ద స్థిరపింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి(14 పైసలు) బలపడటం, అమెరికా మార్కెట్లో పసిడి ఫ్యూచర్లలో భారీ లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం తదితర అంశాలు పసిడికి
ప్రతికూలాంశాలుగా మారాయి. అయినప్పటికీ.., పసిడి ధర రూ.35000పైన ముగియడం విశేషం. ఈ వారంలో దేశీయంగా పసిడి ధర రూ.92లు లాభపడింది.
You may be interested
ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్ సేవల నిలిపివేత
Saturday 20th July 2019ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్ తన సేవలు నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వినియోగదారులు తన ఖాతాల్లో ఏమైనా నగదు నిల్వలున్నట్లైతే, జూలై 26వ తేదిలోగా విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరింది. నగదు విత్డ్రా, బదిలీలు చేసుకునేందుకు ఆన్లైన్, మొబైల్ బ్యాంక్, లేదా దగ్గరలోని బ్యాంక్ పాయింట్లలో సౌకర్యం కల్పించినట్లు తెలిపింది. ఈ అంశంపై వినియోగదారుల ఏదైనా సమస్యలు, సందేహాల నివృత్తి కొరకు 18002092265 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసింది. వ్యాపార
11400ల దిగువన ముగిసిన ఎస్జీఎక్స్ నిఫ్టీ
Saturday 20th July 2019విదేశీ మార్కెట్లలో ట్రేడయ్యే ఎస్జీఎక్స్ నిఫ్టీ శుక్రవారం రాత్రి 11380 వద్ద ముగిసింది. ఇది ఎన్ఎస్ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్ శుక్రవారం ముగింపు 11422 పాయింట్లతో పోలిస్తే 42 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ వాతావారణం నెలకొంది. ఆసియా మార్కెట్లు లాభాల్లోనూ ముగియగా, రాత్రి అమెరికా మార్కెట్లు మాత్రం నష్టాలతో ముగిశాయి. దేశీయంగా ఎలాంటి అనూహ్య పరిణామాలూ జరగకపోతే నిఫ్టీ ఇండెక్స్ సోమవారం నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు