News


ఏప్రిల్‌లో భారీగా పెరిగిన పసిడి దిగుమతులు

Tuesday 21st May 2019
Markets_main1558423039.png-25859

  • 54 శాతం వృద్ధితో 
  • 3.97 బిలియన్‌ డాలర్లుగా నమోదు

న్యూఢిల్లీ: దేశంలోకి పసిడి దిగుమతులు ఏప్రిల్‌లో భారీగా పెరిగాయి. 2018 ఏప్రిల్‌ దిగుమతుల పరిమాణం 2.58 బిలియన్‌ డాలర్లతో పోల్చితే 2019 ఏప్రిల్‌లో 54 శాతం వృద్ధితో 3.97 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వాణిజ్య​ మంత్రిత్వశాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది.  అయితే ఈ పరిణామం కరెంట్‌ అకౌంట్‌ లోటు (దేశంలోకి ఒక నిర్ధిష్ట కాలంలో వచ్చీ-పోయే విదేశీ మారకం మధ్య ఉండే నికర వ్యత్యాసం)పై ప్రభావం చూపడం గమనార్హం. ఏప్రిల్‌లో క్యాడ్‌  విలువ 15.33 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఇది ఐదు నెలల గరిష్టస్థాయి. 2018-19 మూడవ త్రైమాసికంలో (అక్టోబర్‌-డిసెంబర్‌)  స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో పోల్చితే కరెంట్‌ అకౌంట్‌ లోటు 2.5 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ లోటు 2.1 శాతమే కావడం గమనార్హం. భారత్‌ వార్షికంగా దాదాపు 800 నుంచి 900 టన్నుల విలువైన పసిడిని దిగుమతి చేసుకుంటోంది. 



You may be interested

హెచ్‌పీసీఎల్‌కు రూ.2,970 కోట్ల లాభం

Tuesday 21st May 2019

70 శాతం వృద్ధి కలిసొచ్చిన ఇన్వెంటరీ లాభాలు షేరుకు 9.40 తుది డివిడెండ్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ హెచ్‌పీసీఎల్‌ మార్చి త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఇన్వెంటరీ లాభాలు, రూపాయి పెరుగుదల కలిసొచ్చాయి. వీటి ప్రభావంతో రిఫైనరీ మార్జిన్ల క్షీణత ప్రభావాన్ని కంపెనీ అధిగమించి మరీ మంచి లాభాలను నమోదు చేసింది. రూ.72,840 కోట్ల ఆదాయంపై రూ.2,970 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ

ఫలితాల్లో అదరగొట్టిన భారత్‌ఫోర్జ్‌

Tuesday 21st May 2019

న్యూఢిల్లీ: భారత్‌ ఫోర్జ్‌ మార్చి త్రైమాసికం ఫలితాలతో మెప్పించింది. స్టాండలోన్‌ లాభం మూడు రెట్లు పెరిగి రూ.299 కోట్లకు చేరింది. ఆదాయం సైతం రూ.1,718 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.100 కోట్లు, ఆదాయం రూ.1,500 కోట్లుగా ఉన్నాయి. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.10,348 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.1,032 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.8,556 కోట్లు,

Most from this category