News


బంగారం దిగుమతులు 9 శాతం డౌన్‌

Monday 17th February 2020
Markets_main1581908673.png-31836

  • తొలి పది నెలల్లో 24.64 బిలియన్‌ డాలర్ల మేర

న్యూఢిల్లీ: ఆర్థిక రంగ మందగమన ప్రభావం బంగారం దిగుమతులపైనా చూపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల కాలంలో (2019 ఏప్రిల్‌ నుంచి 2020 జనవరి వరకు) 24.64 బిలియన్‌ డాలర్ల విలువైన (రూ.1.74 లక్షల కోట్లు) బంగారం మన దేశంలోకి దిగుమతి అయింది. కానీ, అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో జరిగిన బంగారం దిగుమతులు 27 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంటే 9 శాతం తగ్గినట్టు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. బంగారం దిగుమతులు తగ్గడం కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌ ) తగ్గేందుకు సాయపడింది. దేశ కరెంటు ఖాతా లోటు 2019 ఏప్రిల్‌ నుంచి 2020 జనవరి నాటికి 133.27 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. అంతక్రితం ఇదే కాలంలో క్యాడ్‌ 163.27 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మరింత వివరంగా చూస్తే గతేడాది జూలై నుంచి బంగారం దిగుమతులు క్షీణించడం ఆరంభమైంది. మధ్యలో అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో మాత్రం దిగుమతులు స్వల్పంగా పెరిగాయి. గత డిసెంబర్‌లో 4 శాతం మేర క్షీణించగా, ఈ ఏడాది జనవరిలో ఏకంగా 31.5 శాతం దిగుమతులు పడిపోయాయి. మన దేశంలోకి వార్షికంగా 800-900 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. 
ఎందుకీ పరిస్థితి..?
బంగారం దిగుమతులు కరెంటు ఖాతా లోటును పెంచుతున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచేసింది. అధిక సుంకాల కారణంగా ఆభరణాల తయారీని కంపెనీలు ఇతర దేశాలకు తరలిస్తున్నాయన్నది పరిశ్రమ వర్గాల ఆరోపణగా ఉంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ పరిశ్రమ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది. అధిక సుంకాల కారణంగా బంగారం అక్రమ రవాణా కూడా దిగుమతులు తగ్గేందుకు కారణమన్న వాదన కూడా ఉంది. మరోవైపు ఆర్థిక మందగమన పరిస్థితులు కూడా కొంత వరకు కారణమేనన్న అభిప్రాయం కూడా నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. 



You may be interested

ట్రంప్ పర్యటనపై కార్పొరేట్ల ఆశలు

Monday 17th February 2020

మినీ వాణిజ్య ఒప్పందంపై అంచనాలు న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఈ నెల 24,25న భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన టూర్‌పై దేశీ కార్పొరేట్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా 'మినీ' వాణిజ్య ఒప్పందం కుదరగలదని, అమెరికా కంపెనీలు మరింత పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు ఉండవచ్చని ఆశిస్తున్నారు. ఈ టూర్‌లో భాగంగా ఒక చిన్న పాటి వాణిజ్య ఒప్పందమైనా కుదిరితే తదుపరి సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని

ఏజీఆర్ బాకీలు నేడు చెల్లించనున్న టెల్కోలు

Monday 17th February 2020

చెల్లించే మొత్తాన్ని బట్టి టెలికం శాఖ తదుపరి చర్యలు న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో మరిన్ని కఠిన చర్యల ఎదుర్కొవాల్సిన పరిస్థితి రాకుండా.. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీలను భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్‌ సోమవారం చెల్లించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మూడు సంస్థలు టెలికం శాఖకు ఈ విషయం తెలియజేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆయా సంస్థలు చెల్లించే మొత్తాన్ని బట్టి

Most from this category