News


బంగారం దిగుమతులు తగ్గుముఖం

Monday 25th November 2019
Markets_main1574666116.png-29835

  • ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో 9 శాతం క్షీణత

దేశీయ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) పై ప్రభావం చూపే బంగారం దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ కాలంలో 9 శాతం తగ్గాయి. సమీక్షిస్తున్న కాలంలో భారత్ 17.63 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. మన కరెన్సీలో ఇది రూ.1.25 లక్షల కోట్లు. క్రితం ఏడాది ఇదే సమయంలో దిగుమతి చేసుకున్న 19.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే తొమ్మిది శాతం తక్కువ. ద్రవ్య, వాణిజ్య లోటును కట్టడి చేయడానికి కేంద్రం ప్రస్తుత సార్వత్రిక బడ్జెట్‌లో బంగారం దిగుమతులపై సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. మరోవైపు అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా బంగారానికి భారీ ఎత్తున డిమాండ్‌ నెలకొంది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి మనదేశంలోనికి దిగుమతులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి బంగారం దిగుమతులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే అక్టోబర్‌లో వార్షిక ప్రాతిపదికన బంగారం దిగుమతులు 5శాతం పెరిగి 1.84 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. సాధారణంగా మన దేశంలో అభరణాల పరిశ్రమ నుంచి బంగారానికి ఎక్కువగా దిగుమతి ఉంటుంది. ప్రతి ఏడాది 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.
బంగారం దిగుమతులు తగ్గడం వల్ల దేశ వాణిజ్య లోటు తగ్గింది. గత ఏడాది 116.15 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు ఇప్పుడు 94.72 బిలియన్ డాలర్లకు తగ్గింది. ద్రవ్య, వాణిజ్య లోటును కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో పసిడి దిగుమతులపై సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) పలుమార్లు కేంద్రానికి విన్నవించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - అక్టోబర్ కాలంలో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 2% తగ్గి 1,830 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ బంగారం దిగుమతులు 3% తగ్గి 3,280 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. 



You may be interested

ఎంఎఫ్‌ పెట్టుబడులు ఎప్పుడు వెనక్కు తీసుకోవాలి!

Monday 25th November 2019

ధీరేంద్ర కుమార్‌ సూచనలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్తగా పెట్టుబడులు పెట్టేవాళ్ల కోసం బోలెడు పథకాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు నెట్‌ నిండా పలు సైట‍్ల సిఫార్సులు, పలువురు నిపుణుల సలహాలు హోరెత్తిస్తుంటాయి. అందువల్ల ఎంఎఫ్‌లో పెట్టుబడులకు పెద్దగా ఆలోచించాల్సిన పని రిటైలర్‌కు రాదు. ఉన్నవాటిలో నాణ్యమైన పథకాన్ని, నాణ్యమైన నిపుణుడి సలహాను ఎంచుకొంటే సగం పనైపోతుంది. కానీ ఆ తర్వాతే అసలు సమస్య వస్తుంది. ప్రతిఒక్కరు ఏది కొనాలి?

పీఎస్‌యూ బ్యాంకింగ్‌కు కొనుగోళ్ల మద్దతు

Monday 25th November 2019

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా సోమవారం ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ నేటి మిడ్‌సెషన్‌ కల్లా 1.50శాతం ర్యాలీ చేసింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,562.05 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ రంగ షేర్ల కొనుగోళ్లకు ఆస్తకి చూపడంతో ఇండెక్స్‌ ఒక దశలో 1.50శాతం లాభపడి 2,595.55స్థాయికి ఎగిసింది. మధ్యాహ్నం 12:15ని.లకు ఇండెక్స్‌

Most from this category