News


బంగారానికి ‘ట్రంప్‌’ బూస్ట్‌

Wednesday 4th December 2019
Markets_main1575430288.png-30036

  • వాణిజ్య యుద్ధం ముగింపు ఇప్పట్లో ఉండదన్న సంకేతాలు

న్యూయార్క్‌/న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధానికి ఇప్పట్లో ముగింపు లభించే అవకాశాలు లేవన్న సంకేతాలు పసిడికి ఊతం ఇస్తున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌- నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర మంగళవారం  భారీగా పెరిగింది. ఈ వార్తరాసే రాత్రి 9గంటల సమయంలో పసిడి ధర 17 డాలర్లు పెరిగి 1,486 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెజిల్‌, అర్జెంటీనాలపై సోమవారం అమెరికా వాణిజ్య ఆంక్షలు,  చైనాతో 2020 ఎన్నికల వరకూ వాణిజ్య యుద్ధం సమసిపోయే అవకాశాలు లేవని మంగళవారం అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన పసిడికి బలాన్ని ఇచ్చాయి. హాంకాంగ్‌ ఆందోళనకారులకు మద్దతునిచ్చే హ్యూమన్ రైట్స్ అండ్ డెమాక్రసీ యాక్ట్‌పై అమెరికా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సంతకం చేయడం,  హాంకాంగ్‌లో ఆందోళనకారులకు మద్దతు కొనసాగిస్తే, దానికి ప్రతిగా తాము కూడా తగిన రీతిలో బదులివ్వాల్సి ఉంటుందని చైనా అమెరికాను హెచ్చరించడం తత్సంబంధ అంశాలు పసిడిపై ఇప్పటికే తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి.  

1,460 డాలర్ల వద్ద కీలక మద్దతు...
నవంబర్‌ 29వ తేదీతో (శుక్రవారం) ముగిసిన వారంలో మూడుసార్లు 1,460 డాలర్ల వద్ద కీలక మద్దతు తీసుకుంది. వారం చివరకు 1,470 వద్ద ముగిసింది. వారం వారీగా కదలికల్లో దాదాపు నిశ్చలంగా ఉంది. సోమవారం, మంగళవారం కూడా 1,660 డాలర్ల వద్ద పసిడి మద్దతు తీసుకుంది.  ప్రస్తుత రాజకీయ, వాణిజ్య  పరిస్థితి ఇదే విధంగా ఉద్రిక్తతతో కొనసాగితే పసిడి మరింత లాభలబాటన పయనించే అవకాశం ఉందన్నది విశ్లేషణ. నిపుణుల అభిప్రాయం ప్రకారం... మంగళవారం పసిడి ప్రధాన నిరోధం 1,478 డాలర్లు అధిగమించిన నేపథ్యంలో తదుపరి 1,539, 1,601 డాలర్లు నిరోధంగా పనిచేస్తాయి. 1,435, 1,389, 1,353 డాలర్లు పసిడికి మద్దతుగా నిలుస్తున్నాయి.   గడిచిన 52 వారాల్లో పసిడి ధర ఔన్స్‌ (31.1గ్రా) ధర  1,248 డాలర్ల కనిష్ట స్థాయిని చూసింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, ఉత్తరకొరియా, ఇరాన్‌ వంటి దేశాలకు సంబంధించి భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగి నెలన్నర క్రితం 1,566 డాలర్లను తాకింది. అటు తర్వాత దాదాపు 100 డాలర్ల కరెక‌్షన్‌తో ట్రేడవుతోంది.

దేశీయంగానూ పటిష్టమే...
 ఇక భారత్‌ విషయానికి వస్తే, ఈ వార్త రాసే 9 గంటల సమయానికి పసిడి ధర 10 గ్రాములకు దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో రూ.816 లాభంతో రూ.38,768 వద్ద ట్రేడవుతోంది. ఇదే విధంగా రాత్రి ట్రేడింగ్‌ కొనసాగి, రూపాయి బలపడకుండా ఉంటే పసిడి ధర బుధవారం దేశీయంగా భారీగా పెరిగే అవకాశం ఉంది. You may be interested

ఆర్‌బీఐ విధాన సమీక్ష ప్రారంభం!

Wednesday 4th December 2019

గురువారం ‘కీలక’ ప్రకటన ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం మంగళవారం  ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, వ్యవస్థలో డిమాండ్‌ వంటి కీలక అంశాలపై చర్చించనుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోసహా కీలక నిర్ణయాలను గురువారం ఆర్‌బీఐ

మారుతీ కార్ల ధరలు పెంపు..!

Wednesday 4th December 2019

జనవరి 1 నుంచి అమలు న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని ఇక నుంచి కస్టమర్లకు బదలాయించక తప్పదని, గడిచిన ఏడాది కాలం నుంచి ధరల భారం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో

Most from this category