News


స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 15th October 2019
Markets_main1571123203.png-28894

అమెరికా - చైనా వాణిజ్య చర్చల చుట్టూ నెలకొన్న ఆశావాదం క్షీణించడంతో మంగళవారం పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ ఎలా బయటకు వెళుతుందో(బ్రెగ్జిట్‌) నిర్ణయించే కీలకమైన ఫలితం కోసం  ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు పెరిగి 1,499 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవల అమెరికా - చైనాల మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందం అమలుపై అనుమానాలు రేకెత్తాయి. ఏదైనా ఒప్పంద అమలు ముందు మరిన్ని చర్చలు అవసమరమని చైనా కొరుకుంటున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ‘‘మార్కెట్లు మంచి రిస్క్-ర్యాలీని ఆస్వాదించాయి. పసిడి కన్సాలిడేషన్‌ ఫేజ్‌లో ఉంది. మంచి రీబౌండ్‌ కోసం మూమెంటం బలహీనంగా ఉంది. మార్కెట్ తక్కువ గరిష్టాలను మరియు తక్కువ కనిష్టాలను నమోదు చేస్తుంది.’’ అని సీఎంసీ మార్కెట్స్‌ విశ్లేషకుడు మార్గరేట్‌ యాంగ్‌ యెన్‌ తెలిపారు. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు లాభపడి 1,497.60 డాలర్ల వద్ద స్థిరపడింది.
దేశీయంగానూ స్వల్ప తగ్గింపే:- 
దేశీయంగా పసిడి ధర స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఫ్లాట్‌గా ప్రారంభం కావడం, ఈక్విటీ మార్కెట్లు లాభాల ట్రేడింగ్‌ తదితర అంశాలు పసిడి ధరకు ప్రతికూలంగా మారాయి. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఎంసీఎక్స్‌ డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.70లు నష్టపోయి రూ.38,156.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటాలు పెంచుకున్న షేర్లివే ..!

Tuesday 15th October 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారతీయ ఈక్విటీలపై విదేశీ పెట్టుబడిదారులు బేరిష్‌ ధోరణిని ప్రదర్శించారు. ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న మందగమనం ఉన్నప్పటికీ, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డిఐఐలు) షేర్ల కొనుగోళ్లకు చొరవ చూపారు. ఈ క్యూ2లో డీఐఐలు రూ.53,820 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, ఇదే సమయంలో ఎఫ్‌ఐఐలు రూ.22,460 కోట్లను ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జూలై-సెప్టెంబర్ కాలంలో సిప్‌ల ద్వారా పెట్టుబడి ప్రవాహం

లాభాల్లో ఆటో షేర్లు..ఐషర్‌మోటర్స్‌ 4% అప్‌

Tuesday 15th October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఉదయం 11.52 సమయానికి 1.98 శాతం లాభపడి 7,669.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన  మారుతి సుజుకీ 2.60 శాతం లాభపడి రూ. 6,998.25 వద్ద, హీరో మోటర్‌ కార్ప్‌ 3.14 శాతం లాభపడి రూ. 2,691.00 వద్ద,  ఐషర్‌ మోటర్స్‌ 4.40     శాతం లాభపడి రూ. 19,135.10 వద్ద

Most from this category