News


3నెలల గరిష్టం వద్ద పసిడి

Wednesday 5th June 2019
Markets_main1559719161.png-26100

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పసిడి ధర బుధవారం మూడు నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో నేడు మరో 10డాలర్లు లాభపడింది. ఔన్స్‌ పసిడి 1,338.95 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలతో ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోతకే మొగ్గు చూపవచ్చని ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ అభిప్రాయపడ్డారు. తక్కువ వడ్డీరేట్ల అంచనాలు పసిడి ర్యాలీకి తోడ్పాటునిస్తున్నాయి. పావెల్‌ వాఖ్యలతో డాలర్‌ ఇండెక్స్‌తో పాటు అమెరికా బాండ్‌ ట్రెజరీ బాండ్‌ ఈల్డ్‌ సైతం పతనమయ్యాయి. ఆరు డాలర్‌ ఇండెక్స్‌ 7వారాల కనిష్టానికి చేరుకుంది. బాండ్‌ ఈల్డ్‌ సైతం 21 వారాల కనిష్ట స్థాయి నుంచి భారీగా రికవరీ అయ్యింది. అమెరికా తన దక్షిణ సరిహద్దు దేశమైన మెక్సికోపై టారీఫ్‌లు విధించిన నాటికి నుంచి పసిడి ఫ్యూచర్లు ఏకంగా 50డాలర్ల మేర ర్యాలీ చేశాయి. 
మూడేళ్ల గరిష్టానికి ఎస్‌పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ నిల్వలు:-
ఇక ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ ఈటీఎఫ్ నిర్వహించే ఎస్‌పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ (జీఎల్‌డీ) పసిడి నిల్వలు...ఇన్వెస్టర్ల తాజా పెట్టుబడులతో మూడేళ్ల గరిష్టానికి ఎగిసాయి. అమెరికా చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమం, ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు తదితర అంశాలతో నిల్వలు పెరిగేందుకు కారణమయ్యాయి. ఎస్‌పీడీఆర్ గోల్డ్ నిల్వలు సోమవారం 16.44 మెట్రిక్‌ టన్నుల(2.2శాతం) ఎగిశాయి. 2016 జూల్‌ తరువాత ఇంత స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి విశేషం. 
దేశీయంగా రూ.32500లపై ముగింపు:- 
నిన్న రాత్రి ఎంసీక్స్‌ మార్కెట్లో పసిడి ధర రూ.108.00లు పెరిగి రూ.32586.00ల వద్ద ముగిసింది. రంజాన్‌ పర్వదినం సందర్భంగా నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్‌ పని చేయడం లేదు.



You may be interested

ఐట్యూన్స్‌కు యాపిల్ గుడ్‌బై..

Wednesday 5th June 2019

ఇకపై మూడు యాప్స్‌గా మార్పు శాన్‌ జోస్‌: ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ రూపురేఖలు మార్చేసిన ఐట్యూన్స్‌ యాప్‌ ఇకపై కనుమరుగు కానుంది. దీని స్థానంలో మూడు యాప్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు టెక్‌ దిగ్గజం యాపిల్‌ ప్రకటించింది. యాపిల్‌ మ్యూజిక్, పాడ్‌కాస్ట్స్, యాపిల్‌ టీవీ ఇందులో ఉంటాయని వివరించింది. 2001లో తొలిసారిగా ఐట్యూన్స్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఇంటర్నెట్‌ మాధ్యమంగా మ్యూజిక్, ఆన్‌ డిమాండ్‌ వీడియోలు మొదలైనవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. తాజాగా ఐట్యూన్స్‌ను మూడు వేర్వేరు యాప్‌ల

లాభాల్లో ఆసియా మార్కెట్లు

Wednesday 5th June 2019

అమెరికా మార్కెట్ల నుంచి లాభాల ముగింపు అందుకున్న ఆసియా మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లను తగ్గించేందుకు మొగ్గుచూపడంతో పాటు,  డాలర్‌ ఇండెక్స్‌ 7వారాల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఆసియా మార్కెట్లలో జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225 ఇండెక్స్‌ 2శాతం లాభపడగా, చైనా షాంఘై కాంపోజిట్‌ సూచి అరశాతం పెరిగింది. వాటితో పాటు సింగపూర్‌ స్రైట్‌

Most from this category