News


ఫ్లాట్‌గా పసిడి ధర

Thursday 16th January 2020
Markets_main1579158493.png-30964

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ఫ్యూచర్ల ధర ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ఫ్యూచర్ల ధర రూ.30ల స్వల్పలాభంతో 39640.00 వద్ద కదలాడుతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతుండటం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి లాభంతో ట్రేడ్‌ అవుతుండటం దేశీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గిస్తున్నాయి. అమెరికా చైనాల మధ్య కుదిరిన తొలి దశ ఒప్పందం ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రధాన సమస్యలకు సరైన పరిష్కార మార్గాన్ని నిర్దేశించడంలో విఫలమైనట్లు కొందరు మార్కెట్‌ విశ్లేషకులు విమర్శించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. నిన్నటి ట్రేడింగ్‌లో  మార్కెట్‌ ముగిసే 10గ్రాముల పసిడి ధర రూ.164లు లాభపడి రూ. 39611 వద్ద స్థిరపడింది. అమెరికా ఇరాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా గడచిన ఏడాదిలోఎంసీఎక్స్‌ ఫ్యూచర్స్‌ 10గ్రాముల పసిడి ధర రూ.41300 వద్ద రికార్డు స్థాయిని అందుకుంది. నాటి నుండి కేవలం ఏడు ట్రేడింగ్‌ సెషన్‌ల్లో సుమారు రూ.1,600లు నష్టాన్ని చవిచూశాయి. 

 ఇక అంతర్జాతీయంగానూ పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఉదయం ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1.25డాలరు స్వల​నష్టంతో 1,552.75 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ‘‘చైనాతో వాణిజ్య యుద్ధానికి దారితీసిన నిర్మాణాత్మక ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో కుదుర్చుకున్న ఒప్పందం  పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా చైనా అనుబంధ సంస్థలకు రాయితీలు ఇవ్వడం, అమెరికా మేధోసంపత్తి తస్కరణ లాంటి క్లిష్టతరమైన సమస్యలకు పరిష్కారం మార్గం చూపలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మందగించిన సుంకాలను పూర్తిగా తొలగించలేదని, అసంపూర్తిగా కుదిరిన ఒప్పందంతో చైనా కొనుగోలు లక్ష్యాలను సాధించలేకపోయింది.’’ అని ఆర్థికవేత్తలు పెదవివిరిచారు. చైనా నాలుగో త్రైమాసికపు జీడీపీ గణాంకాలతో పాటు డిసెంబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.  నిన్నరాత్రి అమెరికా సూచీలు గరిష్టస్థాయి నుంచి వెనక్కి రావడంతో మార్కెట్‌ ముగిసే సరికి 9.40డాలర్ల పెరిగి 1,554 డాలర్ల వద్ద స్థిరపడింది. You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 16th January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  డెన్‌ నెట్‌వర్క్‌:-  డెన్‌ నెట్‌వర్క్‌ ఆర్థిక సంవత్సరం-2020 మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ముగిసిన ఆర్థిక సంవత్సరం 2019 మూడో త్రైమాసికంలో రూ.31.2 కోట్లు నష్టపోగా.. ఈ త్రైమాసికంలో పుంజుకుని నికర లాభాన్ని రూ.12.3 కోట్లుగా ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కార్యాకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.318 కోట్లు ఉంది. గతేడాది ఈ ఆదాయం రూ.308 కోట్లుగా నమోదైంది.  రిలయన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌:- గతేడాది

జెట్‌ ఎయిర్‌- స్టెరిలైట్‌ టెక్‌కు షాక్‌

Thursday 16th January 2020

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నాయి. వాణిజ్య వివాదాల పరిష్కారానికి వీలుగా అమెరికా, చైనా మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో బుధవారం అమెరికా మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. అయితే దేశీయంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. విభిన్న వార్తల కారణంగా ప్రయివేట్‌ రంగ కంపెనీలు.. జెట్‌ ఎయిర్‌వేస్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా

Most from this category