News


స్థిరంగా పసిడి ధర

Wednesday 16th January 2019
Markets_main1547616663.png-23612

ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. బ్రెగ్జిట్‌ ఆందోళనలు, కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ యధాతథ పాలసీ అంచనాలు పసిడికి అండగా నిలుస్తున్నాయి. ఫలితంగా ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి స్వల్పంగా 1డాలరు లాభపడి 1,289.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో బ్రిటన్‌ కొనసాగాలా... లేదా (బ్రెగ్జిట్‌)అనే అంశంపై బ్రిటన్‌ పార్లమెంట్‌లో చారిత్రక ఓటింగ్‌ జరిగింది. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 423 ఓట్లు రాగా, అనుకూలంగా 202 ఓట్లు వచ్చాయి. బ్రెగ్జిట్‌కు మొదటి నుంచి మద్దతు తెలిపుతున్న బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే  ఓటింగ్‌లో ఓటమిపాలయ్యారు. బ్రెగ్జిట్‌ అంశంలో ఓటమి చవిచూసిన థెరిస్సా మే బుధవారం ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోంది. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ మందమగనం నేపథ్యంలో ఆ దేశపు ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లపై యధాతథ పాలసీకి కట్టుబడి ఉంటుదనే అంచానాలు వెలువడ్డాయి. ఇక నిన్న రాత్రి అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు నేపథ్యంలో పసిడి ధర రాత్రి 3డాలర్ల వరకు నష్టపోయి 1,288.40 వద్ద స్థిరపడింది.
దేశీయంగానూ స్థిరంగా:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లోనూ పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఎంసీక్స్‌ మార్కెట్లో ఉదయం గం.10:40లకు ఔన్స్‌ పసిడి ధర రూ.2.00లు లాభపడి రూ.32182.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

డిసెంబర్‌లో ఎంఎఫ్‌ల కొనుగోళ్లు, అమ్మకాలు!

Wednesday 16th January 2019

దేశీయ ఈక్విటీల్లోకి నిధుల ప్రవాహం నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో 21 శాతం క్షీణించి రూ. 6606 కోట్లకు చేరింది. అయితే సిప్స్‌లోకి నిధుల ప్రవాహం మాత్రం ఆల్‌టైమ్‌ గరిష్ఠస్థాయికి చేరింది. డిసెంబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ యుటిలిటీస్‌, చమురు, గ్యాస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలపై ఆసక్తి చూపాయి. టెక్నాలజీ, ఆటో, హెల్త్‌కేర్‌, మెటల్స్‌, కన్జూమర్‌, టెలికం, సిమెంట్‌ రంగాలపై అనాసక్తత కనబరిచాయి.  గతనెల్లో ఫండ్‌మేనేజర్లు కొనుగోలు చేసిన షేర్లు.. లార్జ్‌క్యాప్స్‌: ఓఎన్‌జీసీ, ఐఓసీ, భారత్‌

10700-10800 పాయింట్ల శ్రేణి కీలక మద్దతు

Wednesday 16th January 2019

మరోమారు నిఫ్టీ కీలకమైన 10870 పాయింట్లను దాటి బలంగా క్లోజయింది. నిఫ్టీ 200 రోజుల డీఎంఏ స్థాయికి పైన ముగియడం పాజిటివ్‌ అంశమని ఎస్‌ఎంసీ గ్లోబల్‌ పేర్కొంది. బుధవారం నిఫ్టీ 10900 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. డెరివేటివ్స్‌ గణాంకాలు పరిశీలిస్తే 10700, 10800 పాయింట్ల వద్ద పుట్‌ రైటింగ్‌, 11000 పాయింట్ల వద్ద కాల్‌ అన్‌వైండింగ్‌ కనిపిస్తోంది. అందువల్ల స్వల్పకాలానికి నిఫ్టీకి 10700- 10800 పాయింట్లు కీలక మద్దతు స్థాయిలుగా

Most from this category